గుడ్ సమరిటన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
1 min read– క్యాన్సర్ పై అత్యాధునిక టెక్నాలజీ పరంగా శాస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి
– జిల్లా ఎడిషనల్ ఎస్పీ సూర్య చందర్రావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : క్యాన్సర్ పై అవగాహన పెంచుకుంటే నివారణ సాధ్యమని, పలువురు వైద్యులు సూ చించారు. శనివారం ఉదయం నగరంలోని ఇండోర్ స్టేడియంలో ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా స్థానిక వంగాయ గూడెం గుడ్ సమరిటన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ జనరల్ ఆసుపత్రి వారి సౌజన్యంతో నగరంలోని విద్యార్థులకు అవగాహన ర్యాలీ మరియు సదస్సు కల్పించారు. ముందుగా నగరములోని ప్రధాన వీధుల్లో అవగాహన ర్యాలీ భారీ ఎత్తున జరిగింది. అనంతరం ఇండోర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యఅతిధిగా విచ్చేసిన ఎడిషనల్ ఎస్పీ సూర్యచంద్రరావు మాట్లాడుతూ ఈరోజుల్లో క్యాన్సర్ వ్యాధిపై అత్యాధునిక టెక్నాలజీ పరంగా చికిత్సలు జరుగుతున్నాయని అయితే దీనికి ముందుగా వ్యాధి రాకుండా దీనిపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగితే వ్యాధి నివారణ సాధ్యమవుతుందన్నారు. విద్యార్థులు తెల్లవారుజామున లేచి తగిన విధంగా వ్యాయామం చేయడం తదితర అంశాల పట్ల అవగాహన పెంచుకొని చదువులో ఉన్నతస్థాయితో పాటు ఎటువంటి అనారోగ్యాలు దరిచేరకుండా సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన జీవితాన్ని అనుభవిస్తారన్నారు. క్యాన్సర్ ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ రాజ్య లక్ష్మి మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులు ఎడిషన్ క్లోన్ కాకుండా జాగ్రత్తలు పాటించుకోవాలన్నారు. మొబైల్ టీవీ, లేప్టాఫ్ వినియోగం తదితర పనులు వల్ల ఆకర్షణ తగ్గించుకొని ఆరోగ్యం పై శ్రద్ధ పెంచుకోవాలని సూచనలు సలహాలు ఇచ్చారు. ఆసుపత్రి రిపర్జెంట్ డాక్టర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధుల్లోని కొన్ని రకాలైన వ్యాధులను సూచిస్తూ వీటిపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో క్యాన్సర్ హాస్పటల్ యాజమాన్యం ఫాదర్ సిజ్జిహో జెవియర్, ఆస్పత్రి వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సారధి, డాక్టర్ నరసింహారావు, డాక్టర్ నివాస్, డాక్టర్ చందన, డాక్టర్ బాషా పలువురు సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.