యాగంటి బసవన్న గోశాల నిర్మాణానికి శంకుస్థాపన
1 min read– బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు.
– యాగంటి కి వచ్చే భక్తాదులకు పాలు,పెరుగు,నెయ్యి నిత్యం అందుబాటులో
పల్లెవెలుగువెబ్ బనగానపల్లె: బనగానపల్లె మండలం యాగంటి దేవస్థానం సమీపంలో యాగంటి బసవన్న గోశాల నిర్మాణానికి బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మరియు పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని రామిరెడ్డి గారు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ మన హిందూ సనాతన ధర్మంలో గోవుకి ఎంతో ప్రాధాన్యత ఉందని గోవును నిత్యం పూజిస్తే సకల పాపాలు హరించిపోతాయని అలాగే ఆవు యొక్క మూత్రాన్ని మన ఇంటి ఆవరణంలో ఇంట్లో చల్లుకుంటే సకల రోగ నివారిణి అని అందుకే మన పెద్దలు ప్రతి ఇంట గోవును పెంచుకోవడం ఆనవాయితీగా ఉండేదని చెప్పారు. మన బుర్ర వెంకటేశ్వర్లు ఎంతో మహా సంకల్పంతో యాగంటి దేవస్థానం సమీపంలో గోశాలను నిర్మాణం చేపట్టడం చాలా హర్షించదగ్గ విషయమని వెంకటేశ్వర్లకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు. ఈ గోశాల నుంచి ప్రతినిత్యం పాలు పెరుగు ఆవు నెయ్యి యాగంటి దేవస్థానానికి భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని అలాగే ప్రతినిత్యం స్వామి వారి మొదటి పూజకు ఇక్కడి నుంచి ఉచితంగా పాలు, పెరుగు, నెయ్యి తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. నియోజకవర్గంలో ఎక్కడైనా గోవులకు సంరక్షణ లేకుంటే త్వరలోనే ఇక్కడ ఈ గోశాలలో తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. గోసాలను నిర్వహించడం చాలా కష్టతర సాధ్యమని అయినప్పటికీ మనోధర్యంతో ముందుకు వచ్చిన బుర్ర వెంకటేశ్వర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గోశాలకు తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా ఉంటాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో అవుకు మండల వైయస్సార్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, యాగంటి దేవస్థానం పాలకమండలి చైర్మన్ తోట బుచ్చిరెడ్డి, యాగంటి దేవస్థానం మాజీ ఆలయ చైర్మన్ దోనపాటి యాగంటి రెడ్డి, పాతపాడు గ్రామపంచాయతీ సర్పంచ్ బెడదల మహేశ్వర్ రెడ్డి, గడ్డం వెంకటేశ్వర రెడ్డి, బండి బ్రహ్మానందరెడ్డి, బెడదల చంద్రశేఖర్ రెడ్డి, నాగిరెడ్డి, జిల్లేల్ల శంకర్ రెడ్డి,వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.