ఇఫ్ట్ నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా మజీద్ మియా ఎన్నిక..
1 min read– నంద్యాల జిల్లా కోశాధికారిగా మౌలాలి ఎన్నిక..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: భారత కార్మిక సంఘాల సమైక్య నాలుగో జిల్లా మహాసభలు సోమవారం కర్నూలు నగరం డ్రైవర్స్ అసోసియేషన్ భవనం లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఫ్ట్ డివిజన్ ఉపాధ్యక్షుడు లాజరస్ మాట్లాడుతూ ఈ మహాసభల్లో నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా నందికొట్కూరు ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు కామ్రేడ్ మజిద్ మియ్యను ఎన్నుకోవడం జరిగిందన్నారు. డివిజన్ అధ్యక్షుడిగా ఉన్న మౌలాలిని జిల్లా కోశాధికారిగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికులకు ఆటో కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగితే బీమా లేకపోవడం చాలా బాధాకరమని వారు అన్నారు. 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ గా మార్పు చేస్తూ కేంద్రం జీవో తీసుకొని రావడం జరిగిందన్నారు. వెంటనే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వారికి వెంటనే బీమా సౌకర్యం కల్పించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని అన్నారు. జిల్లా కమిటీ సభ్యులుగా లాజరస్, రమేష్, శిరీషలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ఆది ప్రగతి శీల మహిళా సంఘం నాయకురాలు చూరిబీ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు సాయిప్రకాష్, మర్రిస్వామి తదితరులు పాల్గొన్నారు.