PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సి పి ఎస్ ను రద్దు చేయాలి.. పాత పెన్షన్ పునరుద్ధరించాలి : అప్తా

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అప్తా దాని జాతీయ అనుబంధ ఉపాద్యాయ సమాఖ్య (ఎ ఐ పి టి ఎఫ్) పిలుపు మేరకు దేశం లోని 24 రాష్ట్రాల ప్రాథమిక ఉపాధ్యాయ సంఘాల నాయకులు , ఎ ఐ పి టి ఎఫ్ జాతీయ సెక్రెటరీ జనరల్ శ్రీ కమలా కాంత్ త్రిపాఠి , మరియు ఉపాధ్యక్షుడు శ్రీ ఆర్ సి దబాస్ ఆధ్వర్యంలో “ఎంపీ ల తలుపు తలుపు తడదాం సి పి ఎస్ రద్దు చేయమందాం” కార్యక్రమంలో భాగంగా డిల్లీ లోని వివిధ పార్టీల ,వివిధ రాష్ట్రాల లోక్సభ మరియు రాజ్యసభ ఎంపీ లను కలిసి నూతన పెన్షన్ విధానం ఉద్యోగులకు రిటైర్మెంట్ తరువాత జరిగే నష్టాన్ని ,ఉద్యోగుల అభద్రతా భావాన్ని వివిరిస్తున్నారు , పార్లమెంటు లో ఈవిషయం గురించి చర్చించి దేశం లోని అన్ని రాష్ట్రాల ఉద్యోగులకు , కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, చట్టం చేయాలని వారు ఎంపీ లకు మెమోరాండం సమర్పించారు , ఇప్పటికే తిరిగి పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించిన రాష్ట్రాల పై ఏ విధమైన నిర్బందాలు విధించకుండా చూడాలని , ఆయా రాష్ట్రాలకు తిరిగి చెల్లించాల్సిన డబ్బును సత్వరమే చెల్లించాలని వారుకోరారు , మరియు నూతన విద్యావిధానం వల్ల విద్యావ్యవస్థకు , ఉపాద్యాయులకు నష్టదాయకంగా ఉందని కావున ప్రాధమిక పాఠశాలలు ప్రీ కేజీ నుంచి 5 వ తరగతి వరకు కొనసాగించాలని వారు ఎంపీ లను కోరారు, ఇందులో భాగంగా శ్రీ ప్రవేస్సింగ్ వర్మా బి జె పి(ఢిల్లీ), శ్రీ కె.ల్. వర్మా బి జె పి (యూ పి)శ్రీమతి సునీత దేవ్ బి జె డి (ఒరిస్సా) శ్రీ మున్నఖాన్ బి జె డి(ఒరిస్సా) శ్రీ సోయం బాబూ రావ్ బి జె పి(తెలంగాణ) శ్రీ బండి సంజయ్ బి జె పి (తెలంగాణ) శ్రీమతి పూనమ్ మాండం బి జె పి (గుజరాత్) వీరితో పాటు ఉత్తరప్రదేశ్ , మధ్యప్రదేశ్ ,రాజస్థాన్, కేరళ కు చెందిన వివిధ పార్టీల ఎంపీ లను కలిసి తమ ఆవేదనను తెలియజేసారు , ఎ ఐ పి టి ఎఫ్ 24 రాష్ట్రాల ఉపాద్యాయ సంఘాల నాయకుల గౌరవ శ్రీ బండి సంజయ్ గారు మరియు శ్రీమతి పూనమ్ మాండం గార్లు వారి వారి గృహంలో మధ్యాహ్న్ భోజన వసతి ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో అప్తా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎ జి ఎస్ గణపతి రావు పాల్గొన్నారు నిన్న ఈరోజు సెలవులు అవ్వటం చేత ఆంధ్రకు చెందిన ఎంపీ లు అందుబాటులో లేనందున కలవలేకపోయామని గణపతిరావు పత్రికలకు తెలియజేసారు , దేశవ్యాప్తంగా కేంద్ర ,రాష్ట్రల ఉద్యోగులందరికే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేదాకా తమ ఉద్యమం కొనసాగుతుందని , కరోనా కు ముందు ఢిల్లీ లోని జంతర్ మంతర్లో తమ సమాఖ్య ఆద్వెర్యం లో 10 రోజుల పాటు రేలేనిరాహార చేసి , గౌరవ రాష్ట్రపతి గారికి, గౌరవ ప్రధాన మంత్రి గారికి, గౌరవ ఆర్ధికమంత్రి గారికి తమ సమస్యలను సమర్పించామని ఈసందర్భంగా గుర్తు చేశారు, రాబోయే సెప్టెంబర్ నెల 5 వ తేదీ జాతీయ ఉపాద్యాయ దినోత్సవం సందర్భంగా దేశంలో ని నాలుగు ప్రదేశాలనుంచి సి పి ఎస్ ను రద్దు చేయాలని అఖిల భారత ప్రాథమిక ఉపాద్యాయ సమాఖ్య ఆద్వెర్యం లో రథయాత్ర నిర్వహించాలని నిర్ణయించినట్లు గణపతి రావు మీడియాకు తెలియాజేసారు అందులో 1.అస్సాం లోని గౌహతి నుంచి ప్రారంభమై ,పశ్చిమ బెంగాల్ ,ఒరిస్సా,ఝార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ కి , 2 తమిళనాడు లోని కన్యాకుమారి లో ప్రారంభమై ,కేరళ, తమిళనాడు, ఆంధ్రా, తెలంగాణా, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ కి, 3.గుజరాత్ లోని సోమనాథ్ లో ప్రారంభమై ,మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ కి 4.పంజాబ్ లోని వాఘా బోర్డర్ లో ప్రారంభమై ,హిమాచల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ద్వారా ఢిల్లీకి అక్టోబర్ 5 అంతర్జాతీయ ఉపాద్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీ లోని తాల్ కఠోరా స్టేడియంలో కల్మినేషన్ సమావేశం జరుగుతుంద ని ఈ సమావేసానికి దేశంలో ని 24 రాష్ట్రాలనుంచి లక్షలాది ఉపాద్యాయులు హాజరవుతారని అప్తా రాష్ట్ర అధ్యక్షుడు గణపతి రావు తెలియజేసారు , ఆంద్రప్రదేశ్ లో వచ్చే రథయాత్రకు అప్తా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కె.ప్రకాశరావు సారధ్యం వహిస్తారని శ్రీ గణపతి రావు తెలిపారు.

About Author