సంక్షేమ పథకాలు అంధించటమే గడప గడపకు లక్ష్యం..
1 min read– పేదవాడి సంక్షేమం చూసి ఓర్వలేక ప్రతిపక్షాల దుష్ప్రచారం..
– రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఆళ్ల నాని
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: మళ్ళీ మళ్ళీ మీరే రావాలి ఏలూరు గడప గడపలో ఆళ్ల నానికి జన నీరాజనo 76వరోజు గడప గడపకు కార్యక్రమంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం గం.3.30 నుంచి ఏలూరు కార్పొరేషన్ 33వ డివిజన్ 24వ సచివాలయ పరిధిలోని చిట్టివలస పాకల్లో పర్యటించిన రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే , ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు ఆళ్ల నాని.స్థానిక 33వ డివిజన్ కార్పొరేటర్ కత్తిరి రామ్మోహన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆళ్ల నాని కి భారీ గజమాలలు, పూల జల్లులు, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికిన డివిజన్ నాయకులు, కార్యకర్తలు,మహిళలు, అభిమానులు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పధకాల అమలు తీరును లబ్ధిదారుల గడప గడపకు వెళ్లి స్వయంగా పరిశీలించిన ఆళ్ల నానిజగనన్న సంక్షేమ పాలనే భేష్ అంటూ ప్రశంసల జల్లు కురిపించిన లబ్దిదారులు అడుగు అడుగునా ఆళ్ల నాని కి జనం నీరాజనం పలికారు.కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు,సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, డివిజన్ ప్రజలు ఏలూరు : రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేదవాడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు అందేలా చేయటమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ లక్ష్యం అని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు ఆళ్ల నాని అన్నారు. ఇప్పటికే ఎంతో మంది పేద ప్రజలకు నవరత్నాల వల్ల లబ్ది చేకూరిందని, అర్హత ఉండి కూడా మరే ఇతర కారణంతో అయినా సంక్షేమ పథకాలు అందని వారు ఉంటే వారి సమస్యను కూడా సత్వరమే పరిష్కరించి వారికి కూడా పధకాల లబ్ది చేకూరేలా చేయటమే లక్ష్యం గా ఏలూరులో 76 రోజులుగా గడప గడపకు కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందని ఆళ్ల నాని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లో పేదవాడికి అందుతున్న సంక్షేమం చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా తిప్పి కొట్టాలని ఆళ్ల నాని అన్నారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 76వరోజు పాదయాత్రలో భాగంగా సోమవారం మధ్యాహ్నం గం.3.30 నుంచి ఏలూరు కార్పొరేషన్ 33వ డివిజన్ 24వ సచివాలయాల పరిధిలోని చిట్టివలస పాకల ప్రాంతాల్లో ఆళ్ల నాని పర్యటించారు.స్థానిక 33వ డివిజన్ కార్పొరేటర్ కత్తిరీ రామ్మోహన్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు, మహిళలు ఆళ్ల నాని కి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు.భారీ గజమాలలు, మహిళల మంగళ హారతులు, పూల జల్లులతో ఆళ్ల నానికి గడప గడపలో జనం నీరాజనాలు పలికారు.గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల సంక్షేమం కోసం అందిస్తున్న పలు సంక్షేమ పథకాల అమలు తీరును లబ్దిదారులతో మాట్లాడుతూ స్వయంగా పరిశీలించారు.ప్రతి నెలా వాలంటీర్ వచ్చి ఫించన్ అందిస్తున్నాడా అవ్వా?.. అమ్మ ఓడి వచ్చిందా తల్లి.రైతు భరోసా అందిందా తాతా..అంటూ ప్రతి ఒక్కరినీ ఆళ్ల నాని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ సంక్షేమ పధకాల అమలు తీరును స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా తమకు సంక్షేమ పథకాల అమలు ఎంతో బాగుందని, రాబోయే రోజుల్లో జగనన్న కు తామంతా అండగా ఉంటామని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ జీవితాల్లో కొండంత అండ లభించిందని గడప గడపలో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం, డిప్యూటీ మేయర్లు నూకపెయ్యి సుధీర్ బాబు, శ్రీనివాస్, మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరుసు చిరంజీవులు, వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ,మాజీ చైర్మన్ మంచెమ్ మైబాబు, నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు నున్న స్వాతి కిషోర్, వైఎస్సార్ సిపి సీనియర్ నాయకులు MRD బలరాం, కో-అప్షన్ సభ్యులు మున్నుల జాన్ గురునాధ్, వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ మహ్మద్ అరీఫ్, రాష్ట్ర హిస్టరీ అకాడమి డైరెక్టర్ మహ్మద్ ఖైజర్ పాషా, ఏలూరు టూటౌన్ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు షేక్ అమీనా అన్సారీ, కార్పొరేటర్లు జిజ్జువరపు విజయనిర్మల రమేష్, తుమరాడా శ్రీదేవి, పిల్లంగోళ్ల శ్రీదేవి, డింపుల్ చిలకపాటి,పొలిమేర దాసు, దేవరకొండ శ్రీనివాస్, ఇనపనూరి కేదారేశ్వరీ జగదీష్, కడవ కొల్లు సాంబా, సన్నీ, యర్రంశెట్టి సుమన్, జయకర్, లీగల్ సెల్ నాయకులు ప్రత్తిపాటి తంబీ, వైఎస్సార్ సిపి నాయకులు పొలిమేర హరికృష్ణ, జిజ్జువరపు రమేష్, నున్న కిషోర్, కీలాడి దుర్గారావు, బండారు కిరణ్, నిడికొండ నరేంద్ర, శివరావు, పొడిపిరెడ్డి నాగేశ్వరరావు, లూటుకుర్తి సుభాష్, ఇనపనూరి జగదీష్, దారపు తేజా, మోదుగు పుల్లారావు, పిట్టా ధనుంజయ్, , భారతి వెంకట రావు, ఏలూరు టౌన్ రైతు బ్యాంక్ చైర్మన్ దాసరి రమేష్, సుల్తానా, బోగిశెట్టి పార్వతి, వితాల చంద్రశేఖర్, ఆర్యవైశ్య సంఘ నాయకురాలు కురాళ్ళ రమాదేవి, ఏలూరు మునిసిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకట కృష్ణ, ఎమ్మార్వో సోమ శేఖర్, ప్రాజెక్ట్ అధికారి కృష్ణ మూర్తి, టౌన్ ADE కృష్ణం రాజు, AE శేషగిరిరావు, పలు శాఖల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు , 24వ సచివాలయా సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.