ప్రశ్నించే వారినే ఎన్నుకోండి..
1 min read– కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి.
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: చట్టసభల్లో నిరంతరం ప్రజల పక్షాన ప్రశ్నించే వారిని ఎన్నుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, నిరుద్యోగ ఉద్యోగ కార్మికుల సమస్యల పై చట్టసభల్లో పోరాడుతానని ,నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడతానని అందుకు తమను గెలిపించాలని రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు అభ్యర్తించారు. సోమవారం నందికొట్కూరు పట్టణంలో ఎమ్మెల్సీ ప్రచారంలో విస్తృతంగా అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి ప్రచార నిర్వహించారు.అనంతరం పట్టణంలోని జైకిసాన్ పార్కు నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, సీఐటీయూ వామపక్ష పార్టీల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ పోతుల నాగరాజు నిరంతరం ఉద్యోగ,ఉపాధ్యాయ,కార్మిక, కర్షక, నిరుద్యోగ, కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్ బడుగు,బలహీన వర్గాల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తున్నారని ఇటువంటి వారిని గెలిపించుకొనవలసిన అవసరం సమాజానికి ఎంతైనా ఉన్నదని అన్నారు. పట్టభద్రుల కోటా క్రింద నిస్వార్ధంగా పేద ప్రజల వాణి వినిపించే మేధావులను పంపవలసిన పెద్దల సభకు కూడా అక్రమ పద్ధతులతో, డబ్బు మూటలతో పెట్టుబడిదారులను పంపడానికి పాలక,ప్రతిపక్ష పార్టీలు పోటీలు పడడం సిగ్గుచేటు అన్నారు.మేధావి వర్గం ఆలోచించాలని ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై నిస్వార్ధంగా పోరాడే పోతుల నాగరాజు,కత్తి నరసింహారెడ్డి ల కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి పాలక పక్షాలకు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు,సిపిఐ, సిపిఎం జిల్లా నాయకులు రఘురామమూర్తి, నాగేశ్వరరావు,వెంకటేశ్వర్లు, ఏఐఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, న్యాయవాదులు భాస్కర్, శ్రీనివాసులు, ప్రజా సంఘాల నాయకులు పక్కీర్ సాహెబ్, జయమ్మ, దినేష్, శ్రీనివాసులు, జయరాముడు, తదితరులు పాల్గొన్నారు.