బాలింతలు ,గర్భవతులపై ప్రత్యేక శ్రద్ధ
1 min read– జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు గర్భవతులు, బాలింతలు పట్ల తగినటువంటి జాగ్రత్తలు పాటించాల్సిన బాధ్యత సిహెచ్ ఓలు, ఏఎన్ఎంలు, ఆశాలపై ఎంతైనా ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు అన్నారు, మంగళవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో( పి హెచ్ సి) ఆషాడే సందర్భంగా ఏఎన్ ఎం లకు, ఆశాలకు సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ, బాలింతలు, గర్భవతులు ప్రమాద లక్షణాలు కలిగి ఉన్న వారి పట్ల, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి సుఖ ప్రసవానికి సంబంధించి ఏ విధమైన చర్యలు చేపట్టాలి , వారికి ఏ ఏ పోష కాలు అందించాలి వంటి విషయాలపై ఏఎన్ఎం లకు ఆశాలకు సవివరంగా తెలియజేశారు, అదేవిధంగా, వారికి సమయానికి అన్ని పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయాలన్నారు, అలాగే గర్భవతులకు , బాలింతలకు ఇచ్చే పోషక ఆహారాలు సకాలంలో అందే విధంగా చూడాలని ఆయన తెలియజేశారు, అలాగే జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఉమా మహేష్ కుమార్ మాట్లాడుతూ, ఫ్యామిలీ ఫిజీషియన్ డాక్టర్లు సిబ్బంది నిర్దేశించిన ఆయా గ్రామల లోనికి వెళ్ళినప్పుడు, అక్కడ ఉంటే గర్భవతులు బాలింతలు, ప్రజలకు బీపీ ,షుగర్ వంటి వాటిపై వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేయాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ బి చెన్నారెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ ఖాజా మోదీన్, ఎంపీహెచ్ ఈవో ప్రసాద్, ఏఎన్ఎం లు ఆశాలు పాల్గొన్నారు.