అప్పర్ భద్ర వల్ల రాయలసీమ ఎడారి అవుతుంది
1 min read– సోము వీర్రాజు అప్పర్ భద్ర పై సమాధానం చెప్పి రాయలసీమలో పర్యటించండి.
– రవికుమార్, రాష్ట్ర అధ్యక్షులు.ఆర్వీపీయస్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్ణాటకలో కట్టబోయే అప్పర్ భద్ర వల్ల రాయలసీమ ఎడారి అవుతుందని తెలిసినా కేంద్ర ప్రభుత్వం 5,300కోట్లు అప్పర్ బద్ర కోసం కేటాయించడం దేనికి నిదర్శనమో సమాధానం చెప్పి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు రాయలసీమలో పర్యటించాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ అన్నారు. కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ లో మీడియాతో మాట్లాడుతూ రాయలసీమలో ఊర్లకు ఊర్లు ఖాళీ చేసి రైతులు, ప్రజలు వేరే ప్రాంతాలకు వలసలు పోతున్నారని దీనికి రాయలసీమలో సరైన ప్రాజెక్టు లేకపోవడం,నీటిని న్యాయబద్ధంగా రాయలసీమకు ఇవ్వకపోవడం కారణమని అందువలన రాయలసీమ ప్రాంతంలోని గ్రామాలు ఖాళీ చేసి రైతులు,ప్రజలు బతుకుదెరువు కోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్తున్నారని ఈ ప్రాంతంపై శ్రద్ధ చూపాల్సిన కేంద్ర ప్రభుత్వం కేవలం స్వార్థంతో వారి పార్టీకి అనుకూలమైన ప్రాంతాల పట్ల ఒక వైఖరి వారి పార్టీకి అనుకూలత లేని ప్రాంతాల్లో వివక్ష వైఖరి చూపుతోందని అందులో భాగంగానే కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు 5,300 కోట్ల నిధులను ఇవ్వడమే గాక జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలనుకోవడం రాయలసీమ ప్రాంతాన్ని ఎడారి చేయడమేనని 2018 లోనే రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చిన బిజెపి ఇప్పటికీ దాన్ని అమలు చేయలేదని రాష్ట్ర విభజన చట్టంలో రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం అది మరచి కేవలం వారి పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తుండడం మిగతా ప్రాంతాలపై బిజెపి నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తుందని ఆయన అన్నారు.తుంగభద్ర పై ఆధారపడి ఉమ్మడి కర్నూలు,కడప,అనంతపురం జిల్లాలలో దాదాపు 7,94,000 ఎకరాల ఆయకట్టు ఉందని దీనితో పాటు శ్రీశైలం జలాశయం,హంద్రీనీవా,ఎస్సార్బీసీ, తెలుగు గంగా,పోతిరెడ్డిపాడు లపై అప్పర్ భద్ర ప్రభావం పడుతుందని కావునకేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తక్షణమే స్పందించి రాయలసీమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాదాసి మదారి కురువ హక్కుల పోరాట సమితి, రాయలసీమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుంకన్న రాయలసీమ విద్యార్థి పోరాట సమితి జిల్లా అధ్యక్షులు అశోక్, ఎర్రకోటమల్లప్ప,వసంత్ తదితరులు పాల్గొన్నారు.