వికాసం .. కెరీర్ గైడెన్సు పై అవగాహన కార్యక్రమం
1 min read– ముఖ్యఅతిథిగా పాల్గొన్న సెట్ వెల్ సీఈవో యo.డి.హెచ్ మెహారాజ్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : యువత వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి చేసుకోవడం ద్వారా తమ ఎదుగుదలకు కృషి చేయాలని నెహ్రు యువకేంద్రం జిల్లా యూత్ అఫీసర్ డి. కిషోర్ అన్నారు. జిల్లా కలక్టరు వె. ప్రసన్న వెంకటేష్ వారి ఆదేశాల మేరకు, నెహ్రు యువ కేంద్రము, ఏలూరు మరియు యువజన సర్వీసుల శాఖ, సెట్ వెల్ వారి ఆధ్వర్యములో మంగళవారం వేగవరం లోని హిలపురి కాలేజ్ అప్ ఇంజనేరింగ్ & టెక్నాలజీ, విద్యార్థిని విద్యార్థులకు ‘వ్యక్తిత్వ వికాసం మరియు కెరీర్ గైడెన్సు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా సెట్ వెల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి యం.డి. హెచ్. మేహరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వ్యక్తిత్వ వికాసం పై కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సెట్ వెల్ ఎ.ఓ కె.జె. కెనడీ , పర్యాటక శాఖ జిల్లా మేనేజర్ యస్ పట్టభిరామన్న, జిల్లా ఉపాధి కల్పనా అధికారి సి. మధుసూధన రావు, జి. ప్రవీణ్ కృష్ణ, యూత్ ప్రొఫెసనల్ ఆఫీసర్, కళాశాల ప్రిన్సిపాల్ యం. రాధకృష్ణ, సివిల్ డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ యం. శ్రీనివాసరావు, కళాశాల ఎ.ఓ. కరుణానిధి, కళాశాల విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు.