శారీరక వ్యాయామంతో ఆరోగ్యవంతమైన జీవితం
1 min readబనగానపల్లె సీఐ సుబ్బరాయుడు
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో.నేటి పోటీ ప్రపంచంలో ప్రతి మనిషికి వ్యాయామం ఎంతో అవసరమని బనగానపల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు.పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని కరెంట్ ఆఫీస్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన 6 ఎన్ ఫిట్నెస్ స్టూడియో వ్యాయామ కేంద్రాన్ని యజమాని అరుణ్ ఆహ్వానం మేరకు విచ్చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సృష్టిలో ఆరోగ్యాన్ని మించిన సంపద మరొకటి లేదని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.మన శరీరపు బరువును నియంత్రించడానికి, కండరాలను దృఢంగా శక్తివంతంగా ఉంచడానికి, ఎముకలను బలంగా చేయడానికి,వ్యాధి నిరోధక శక్తిని వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది.దైనందిక వ్యాయామం వలన అధిక రక్తపోటు,స్థూలకాయం,గుండె జబ్బులు,మధుమేహం, నిద్రలేమి,మానసిక రోగాల వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నివారించవచ్చు అన్నారు.అనంతరం 6 ఎన్ ఫిట్నెస్ యాజమాన్యం సీఐ సుబ్బరాయుడుని ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాగేంద్ర, అశోక్, మధు,మహేష్, శివ,రఘు ఆసిఫ్, జనార్ధన్, ప్రవీణ్, గడ్డం అమిర్ భాష గడ్డం ఈ రోజు భాష తదితరులు పాల్గొన్నారు.