భానుముక్కల పెద్దమ్మ తల్లి జాతర మహోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: బనగానపల్లె పట్టణంలో నెల 21,22, మంగళవారం బుధవారం భానుముక్కల పెద్దమ్మ తల్లి అమ్మవారి జాతర సందర్బంగా భానుముక్కల రైతు సంఘం ఆధ్వర్యంలో ముందుగా చాకలి వారితో రతి పోయించి పెద్దమ్మ పూజారులైన కుమ్మరులచే అమ్మవారికి ముడుపు కట్టించడం జరిగింది. ఈసందర్బంగా ఆసాదోనితో మాట్లాడించి అనంతరం గ్రామ పెద్దమ్మ జాతరకు వదిలిన దున్నపోతుకు పసుపు కుంకుమ లతో పూల మాలవేసి పూజించి భానుముక్కల బొడ్రాయి వరకు తప్పేట్లతో దున్నపోతును ఊరేగించడం జరిగింది.ఈ పెద్దమ్మతల్లి (అమ్మవారికి )ముడుపు మరియూ దున్నపోతు ఊరేగింపు కార్యక్రమాల్లో భానుముక్కల రైతు సంఘం వారు, ఆయకట్లు, భానుముక్కల ప్రజలు ఎక్కువగా యువత పాల్గొని ఈరోజు కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది.