చిన్నతనం నుంచే సామాజిక సేవ, దేశ భక్తిని పెంపొందించండి
1 min read– స్కౌట్స్ అండ్ గైడ్స్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గిరీష్ పిఎస్
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: విద్యార్థి సమాజంలో క్రమశిక్షణ, సరైన లక్షణాలను పెంపొందించడంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయిని జిల్లా కలెక్టర్ గిరీష్ పిఎస్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ వారి చాంబర్లో కలెక్టర్ వారిని జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ సెక్రటరీ మడితాటి నరసింహారెడ్డి, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీకర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….విద్యార్థి సమాజంలో క్రమశిక్షణ మరియు సరైన లక్షణాలను పెంపొందించడంలో స్కౌట్స్ మరియు గైడ్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయిన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం ద్వారా మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. చిన్న వయస్సులోనే అంకితభావం, సేవ మరియు క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు నేర్పించడం, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. స్కౌట్ క్రమశిక్షణకు మారు పేరని, విద్యార్థి దశలో ప్రతి విద్యార్థి స్కౌట్‌లో చేర్పించాలన్నారు. రిపబ్లిక్ డే పేరేడ్ లో స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ప్రదర్శించిన కవాతు పలువురిని ఆకర్షించిందని గుర్తు చేశారు.అందులో భాగంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాంతీయ శిక్షణా కేంద్రం అభివృద్ధి పై జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ సెక్రటరీ మడితాటి నరసింహారెడ్డి, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీకర్ లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.