PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

న్యాయవాదిపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి

1 min read

న్యాయవాదులు సంఘం అధ్యక్షుడు ఎం. మల్లికార్జున డిమాండ్.
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: న్యాయవాది పులి దామోదర్ పై దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నం చేసిన దుండగులపై సెక్షన్ 307. I. P. C. క్రింద కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని పత్తికొండ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం. మల్లికార్జున, సీనియర్ న్యాయవాదులు పి. ఎల్లరెడ్డి, ఏ. మైరాముడు, బి. సురేంద్ర కుమార్, ఎన్. కృష్ణయ్య లు డిమాండ్ చేశారు.డోన్ పట్టణంలో న్యాయవాది పులి దామోదర్ పై జరిగిన దాడికి నిరసనగా మంగళవారం కర్నూలు జిల్లా పత్తికొండ న్యాయవాదులు సంఘం ఆధ్వర్యంలో స్థానిక కోర్టు విధులు బహిష్కరించి ప్రధాన రహదారిలో నాలుగు స్తంభాలు దగ్గర “రాస్తా రోకో “ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమం ను ఉద్దేశించి ఎం. మల్లికార్జున, పి. ఎల్లారెడ్డి, ఏ. మైరాముడు, బి. సురేంద్ర కుమార్, ఎన్. కృష్ణయ్య లు మాట్లాడుతూ డోన్ లో న్యాయవాది పులి దామోదర్ పై జరిగిన దాడిలో పాల్గొన్న దుండగులను తక్షణమే అరెస్టు చేసి రిమాండ్ కు పంపాలని కోరారు.డోన్ లో మెడికల్ మాఫియా ఈ దాడి చేయించిందని వారు ఆరోపించారు. న్యాయవాదులు కు రక్షణ కల్పించాలని వారు ఆవేదన వ్యక్తంచేశారు. సమాజంలో న్యాయవాదులు సామాజిక మార్పుకోసం పాటుపడుతున్నారని అలాంటి వారిపై దాడులకు పాల్పడడం చాలా దుర్మార్గపు చర్య అని వారు స్పష్టంచేశారు.పులి దామోదర్ పై దాడికి పాల్పడిన దుండగులను అరెస్టు చేసేంత వరకు దశల వారిగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు.న్యాయవాదుల రాస్తా రోకో కార్యక్రమంతో అరగంట పాటు రాకపోకలు తీవ్రంగా స్తంభించాయి. ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు పి. గోపాల్ రెడ్డి,వి. ఈరన్న, కె. నరసింహయ్య, బి. రమేష్ బాబు, బి. రంగస్వామి, వై. శ్రీనివాసరెడ్డి, డి. బాలబాష, ప్రసాద్ బాబు, బదిరి నారాయణ, మహేష్,నారాయణ స్వామి, మధు బాబు, శ్రీకాంత్ రెడ్డి, బి. అరుణ్ కుమార్,నెట్టేకల్లు, అబ్దుల్ రజాక్,రవి ప్రకాష్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

About Author