PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆధార్‌ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి

1 min read

– గ్రామ, వార్డు సచివాలయ జిల్లా అధికారి మనోహర్ రాజు
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు ఆధార్‌ కార్డుల్లో బయోమెట్రిక్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని గ్రామ, వార్డు సచివాలయ జిల్లా అధికారి మనోహర్ రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….మంగళవా­రం నుంచి 4 రోజులపాటు (ఫిబ్రవరి 7 నుంచి 10 వరకు) జిల్లా వ్యాప్తంగా 132 జూనియర్‌ కాలేజీలలో ప్రత్యేక ఆధార్‌ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. కనీసం పదేళ్ల వ్యవధిలో ఒక్కసారైనా ఆధార్‌ కార్డులో బయో­మెట్రిక్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకో­వాలని యూఐడీఏఐ నిబంధన తీసుకొచ్చిన విషయం తెలి­సిందే అన్నారు. జిల్లాలో పదేళ్ల వ్యవధిలో ఒక్కసారి కూడా తమ ఆధార్‌ కార్డులో బయోమెట్రిక్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోనివారు దాదాపు 24,667 మంది ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో ప్రతినెలా ప్రత్యేక ఆధార్‌ క్యాంపులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే అన్నారు. 7 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వయస్సు వారికి ప్రభుత్వం పూర్తి ఉచితంగా బయోమెట్రిక్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవడానికి అవకాశం కల్పి­స్తోంది అన్నారు. ఇప్పటివరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ 15 ఏళ్లలోపు వ­యసు కలిగిన విద్యార్థుల కోసం పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్‌ క్యాంపులు నిర్వహిస్తూ వచ్చింది అన్నారు. సచి­వా­ల­యాల్లో నిర్వహించే ప్రత్యేక ఆధార్‌ క్యాంపుల్లో ఆధార్‌ కార్డులో బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ సేవ­లను ఉచితంగా అందజేయడంతో పాటు నిర్ణీత రుసుం­తో అదనంగా మరో 10 రకాల ఆధార్‌ సేవ­లను పొందే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. బయో­మె­­ట్రిక్‌ (ఫొటో, ఐరిస్, ఫింగర్‌ ప్రింట్‌) అప్‌డేట్, పేరు మార్పు, పుట్టిన తేదీ వివరాల మార్పు, జెండర్, చిరునామా మార్పు సేవలతో పాటు కొత్తగా ఆధార్‌ వివరాల నమోదు, ఆధార్‌ కార్డు డౌన్‌లోడ్‌ సేవలను కూడా ఆ క్యాంపుల్లో పొందవచ్చు అన్నారు. విద్యార్థులు ప్రత్యేక ఆధార్‌ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

About Author