PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన

1 min read

– పలు అభివృద్ధి పనులు పరిశీలన..
– రూ .146.81 లక్షలతో 44 పలు అభివృద్ధి పనులు..
– విజిబుల్ శానిటేషన్ ప్రస్ఫుటం కావాలి..
– జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి డివిజన్లోని,వార్డు సచివాలయానికి 20 లక్షల రూపాయలు చొప్పున మంజూరు చేసిన నిధులు, మరియు ఎంపీ ల్యాండ్ నిధులతో ఏలూరు కార్పొరేషన్ లో చేపట్టి పూర్తి చేసిన సిసి రోడ్లు, డ్రైన్ లు కమ్యూనిటీ భవనాలను, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మున్సిపల్ కమిషనర్ ఎస్ వెంకట కృష్ణ తో కలిసి బుధవారం సుడిగాలి పర్యటన చేసి పరిశీలించారు.గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో రూ.146.81 లక్షలతో 44 పనులలో లబ్బీపేట, ఎం ఆర్ సి కాలనీ ,పంపులు సెంటర్, తోటకూర దొడ్డులు, యాదవ నగర్, రజకుల పేట ,కొత్తపేట, చోడిమిల్లి, పోస్టల్ కాలనీలో పూర్తిచేసిన సిసి రోడ్లు , డ్రైనులను, ఎంపీ నిధులు రూ.91.50 లక్షలు వ్యయంతో నగరం లోని 17,43,25,4,24 డివిజన్లు లో 5 వివిధ అభివృద్ధి పనులు ల్లో పూర్తి అయిన మల్టీపర్పస్ భవనాలు, గాంధీ జ్ఞాన మందిర్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ సిసి రోడ్లు అక్కడక్కడ ఫినిషింగ్ సరిగా లేదని వాటిని సరుచేయాలని, రోడ్లపై వున్న వాటర్ పైపులు తొలగించి నీరు వృధా కాకుండ చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. డ్రైనేజీలో చెత్త తొలగింపు సరిగా లేదని సరిచేసి క్లీనింగ్ చేసిన అనంతరం ఫోటోలు తీసి సమర్పించాలని కమిషనర్ ను ఆదేశించారు.వార్డు సచివాలయంలో ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్లు పర్యవేక్షణ లేదని , వారికి షోకాజ్ నోటీస్ ఇవ్వమని కమిషనర్ ను ఆదేశించారు. గతంలో పారిశుధ్య మెరుగుకు ఏర్పాటు చేసిన టీమ్ పారిశుద్ధ్య మెరుగు చేయడం లో విజిబుల్ శానిటేషన్ కనబడుటలేదని కలెక్టర్ అసంతృప్తి వెలిబుచ్చారు. అనంతరం మేదర వీధిలోని 43 వ వార్డు సచివాలయాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ తనిఖీల్లో స్పందన అర్జీలు , నవరత్నాలు జగనన్న కాలనీ గ్రౌండ్ , సిబ్బందిహాజరు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటన గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఏ ఆర్ డి జి కే నగర బాలికోన్నత పాఠశాలలోని లైబ్రరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, దానికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని, పాఠశాల ఆవరణలో కాంక్రీట్ వేసి బాస్కెట్ బాల్ కోర్టు ఏర్పాటు చేయాలని, మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈ వెంకటేశ్వరరావుని కలెక్టర్ ఆదేశించారు. నగరంలో ఉన్న ప్రైవేటు ఖాళీ స్థలాలలో పేరుకు పోయిన మురుగునీరు , చెత్త తొలగించడానికి యజమానులకు నోటీసులు ఇచ్చి శుభ్రం చేయించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.కలెక్టర్ వెంట మున్సిపల్ కార్పొరేషన్ ఎంఈ భాస్కరరావు ఎంహెచ్ఓ ఆర్ .మాలతి, పబ్లిక్ హెల్త్ డి ఈ ఫణిభూషణ్, మున్సిపల్ ఏఈ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author