రేషన్ బియ్యం డోర్ డెలివరీ చేయాలి : సిపిఐ
1 min read– తహసిల్దార్ కు వినతి పత్రం ఇస్తున్న సిపిఐ నాయకులు
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని దిద్ది చేను కొట్టాల కాలనీ వాసులకు డోర్ డెలివరీ చేయాలని సిపిఐ మండల కార్యదర్శి డి.రాజా సాహెబ్, డిమాండ్ చేశారు. బుధవారం సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో తహసిల్దార్ విష్ణు ప్రసాద్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక వైపు పేదలు నివాసం ఉండే దిద్ది చేను కొట్టాల కాలనీ లో 150 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, అయితే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే రేషన్ బియ్యం డోర్ డెలివరీ వాహనం కాలనీకి రాకపోవడంతో, పేద ప్రజలకు రేషన్ బియ్యం తో పాటు నిత్యావసర సరుకులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి ప్రతినెల క్రమం తప్పకుండా దిద్ది చేను కొట్టాల కాలనీకి రేషన్ బియ్యం వాహనం ద్వారా డోర్ డెలివరీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి.ఎన్.రామాంజనేయులు సిపిఐ జిల్లా సమితి సభ్యులు సురేంద్ర కుమార్, తిమ్మయ్య, కృష్ణయ్య, శాఖా కార్యదర్శి రవి, కొత్తపల్లి, పందికోన, పెద్దహుల్తి శాఖ కార్యదర్శులు గిడ్డయ్య గౌడ్, జోహారాపురం కాశి, రాజప్ప, ఏఐటీయూసీ తాలూకా అధ్యక్షులు నెట్టికంటయ్య, మాదన్న, కాలనీ మహిళలు పాల్గొన్నారు.