PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పంట నమోదు ఈ కే వై సీ తప్పనిసరి

1 min read

– మండల వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ గడివేముల: రబి 2022 లో వేసిన పంటలకు గాను* రైతులు విధిగా ఈ *కేవైసీ చేయించుకోవాలని గురువారం నాడు మండల వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి తెలిపారు గడివేముల మండలంలోని రబి 2022 సంవత్సరానికి గాను ఈ పంటల నమోదు ఇప్పటివరకు 3176 మంది రైతులు 11832 ఎకరాలలో వివిధ పంటలైనటువంటి జొన్న , వరి , మినుము , మొక్కజొన్న, పప్పుశనగా, సోయాబీన్ మరియు ఇతరత్రా పంటలన్నీ కలిపి పంట నమోదు చేసుకున్నారని ఈ పంట నమోదులో రైతుల యొక్క వేలిముద్ర తప్పనిసరి అని ఇప్పటివరకు 1878 మంది రైతులు మాత్రమే వేలిముద్ర వివిధ పంటలకు వేసి ఉన్నారని . దాదాపు 1300 మంది రైతులు వేలిముద్ర వేయాల్సి ఉందని ఆర్ బి కే సిబ్బందిని సంప్రదించి వేలిముద్ర వేయడం ద్వారా గాని లేదా ఆధార్కు లింక్ అయినటువంటి ఫోను కు ఓటిపి ద్వారా మిగతా రైతులందరూ వేలిముద్ర వేయాలని రైతులకు సూచించారు . పంటల తనిఖీల్లో భాగంగా ఇప్పటివరకు వ్యవసాయ, ఉద్యాన శాఖ మరియు రెవెన్యూ అధికారులు మన మండలంలో 607 మంది రైతుల వివిధ పంటలను తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు.

About Author