ఎర్ర బంగారానికి తగ్గిన డిమాండ్..
1 min read– భారీగా పడిపోయిన ధర
పల్లెవెలుగు వెబ్ గడివేముల: గత పదిహేను రోజులుగా గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ కు భారీ స్థాయిలో పంట రావడంతో డిమాండ్ తగ్గడంతో ధర తగ్గి మిర్చి రైతులు లబో దిబో మంటున్నారు గత పది రోజుల క్రితం సూపర్ 10..34..రకం . క్వింటా 23000 పలికిన ధర భారీ స్థాయిలో ఉత్పత్తి మార్కెట్ కు రావడంతో ఈ వారం 19వేలకు పడిపోయినట్టు ఎకరాకు లక్ష రూపాయలు పెట్టుబడి అవుతుందని నల్లి పురుగు వైరస్ తామర పురుగు వల్ల దిగుబడి తగ్గడంతో ఆర్థిక భారం పెరిగిపోతుందని నీళ్ల మందులు పిచికారికి అధిక మొత్తంలో ఖర్చు చేసినట్టు రైతులు వాపోయారు .మూడున్నర ఎకరాలకు మూడు లక్షల ఖర్చు పెట్టాను.. రైతు సాయి శంకర్..ఈసారి మిరప పంటలో లాభాలను చూడాలనే ఉద్దేశంతో దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చుపెట్టిన పంట అమ్మితే కనీసం పెట్టుబడి రాని పరిస్థితి ఏర్పడిందని ధర పడిపోవడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితి దాపురించిందని గని గ్రామానికి చెందిన మిరప రైతు సాయి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
పంట దిగుబడి పెరిగిన ధర తగ్గడంతో లాభాలు అనుమానమే.. రైతు వై శ్రీనివాసులు…
మిరప ధర మార్కెట్లో తగ్గడంతో పంట దిగుబడి పెరిగిన లాభాలు అనుమానమేనని ప్రతిఏటా పంట పెట్టుబడి పెరగడంతో 10 శాతం లాభాలు రావడం కూడా గగనం అయిపోయిందని నవంబర్ డిసెంబర్ లో వాతావరణం అనుకూలించక పోవడంతో పంట కాపాడుకోవడానికి భారీ స్థాయిలో నీళ్ల మందులకు ఖర్చు చేయాల్సి వచ్చిందని గత పది రోజుల్లోనే క్వింటాలుకు 6000 ధర తగ్గడంతో పంటను గోడౌన్లలో నిలువ చేసుకొని ధర వచ్చినప్పుడు అమ్ముతామని గని గ్రామానికి చెందిన మిర్చి రైతు శ్రీనివాసులు తెలిపారు. మార్కెట్లో నిత్యవసర సరుకుల ధరలు మండిపోతుంటే పంట వేసిన రైతుకు మాత్రం ధర తగ్గడంతో గిట్టుబాటు కాకపోవడం ఎగుమతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ప్రతి ఏటా ఇదే పరిస్థితి నెలకొంటుంది.