PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి తొలగించడం దారుణం

1 min read

– ఎన్నికల విధులు సచివాలయ సిబ్బందిని నియమించడం విచారకరం
– ఎన్నికల విధులు ఉపాధ్యాయులనే కొనసాగించాలి:వ్యకాస
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను తొలగించి గ్రామ సచివాలయ సిబ్బందిని నియమించడం విచారకరమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం. నాగేశ్వరావు ఆరోపించారు.శనివారం మిడుతూరు మండలం కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ప్రజాసంఘాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా నాగేశ్వరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష 90 వేల మంది ఉపాధ్యాయులను ఎన్నికల విధులు నుంచి తొలగించి ఎన్నికల అవగాహన అనుభవం లేని లక్ష 30 వేల సచివాలయ సిబ్బందిని వైసీపీకి చెందిన గృహ సారదులకు కన్వీనర్లకు ఎన్నికల సిబ్బందిగా నియమించడం విచారకరమని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే అర్హత లేని వారికి ఓట్లు చేర్పించిందని ఇప్పటికే ఓటర్లు ఆకర్షించేందుకు కడపలో ఉద్యోగులకు క్యాలరీ బాక్సులు పంపిణీ సందర్భంగా పట్టుబడడం జరిగిందని ఆయన తెలిపారు.ఎన్నికల్లో గెలవడానికి అనేక అడ్డదారులకు వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని వారు ఆరోపించారు.ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటాలు చేస్తున్న పట్టుబద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పిడిఎఫ్ అభ్యర్థి పోతుల నాగరాజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కత్తి నరసింహారెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు అన్ని ప్రజాసంఘాలు నాయకులు కార్యకర్తలు పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా సిపిఎస్ రద్దు చేస్తానని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తానని కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగు లుగా చేస్తానని హామీ ఇచ్చిన మాట లేనని అన్నారు. కార్మికులకు సక్రమంగా నెల నెల జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపించారు.ఈసమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు టి. ఓబులేష్,సిఐటియు నాయకులు శివుడు,నాగన్న రైతు సంఘం నాయకులు శివరాముడు తదితరులు పాల్గొన్నారు.

About Author