సిద్దేశ్వరం వద్ద బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలి
1 min readపత్తికొండ, పల్లె వెలుగు.:సిద్దేశ్వరం వద్ద కేంద్ర ప్రభుత్వం నిర్మించ దలచిన ఐకానిక్ బ్రిడ్జి బదులుగా బ్రిడ్జి కమ్ బ్యారేజి నిర్మించాలని పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి క్రాంతి నాయుడు డిమాండ్ చేశారు.ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.అప్పర్ భద్ర ప్రాజెక్ట్ నిర్మాణంతో సీమకు పెనుముప్పు ఏర్పడుతుందన్నారు. రాయలసీమ స్టీరింగ్ కమిటీ సభ్యులు అయిన క్రాంతి నాయుడు రాయలసీమ స్టీరింగ్ కమిటీ తీర్మానం మేరకు రాయలసీమ సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి, కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గారి దృష్టికి, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర శేఖావత్ ల దృష్టికి తీసుకువెళ్ళాలి అని పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి కంగాటి శ్రీదేవిని కోరారు. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలకు జీవనాధారమైన తుంగభద్ర హెచ్.ఎల్.సి, ఎల్.ఎల్.సి, కే సి కెనాల్ కు వస్తూ ఉన్న తుంగభద్ర నికర జలాలకు గండికోడుతూ కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న అప్పర్ భద్ర ప్రాజెక్టును నిలుపుదల చేయాలని, అదేవిధంగా నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సిద్దేశ్వరం వద్ద కృష్ణానది పై కేంద్ర ప్రభుత్వం నిర్మించ దలచిన ఐకానిక్ బ్రిడ్జ్ బదులుగా క్రిష్ణానది పై బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మించి మన రాయలసీమ ప్రాంతానికి, పత్తికొండ నియోజకవర్గం, కర్నూలు జిల్లా కు నీళ్లను అందించాలని, రానున్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాలని పత్తికొండ గౌరవ శాసన సభ్యులు శ్రీమతి కంగాటి శ్రీదేవి గారిని రాయలసీమ స్టీరింగ్ కమిటీ పత్తికొండ నియోజకవర్గం తరుపున కోరామన్నారు. ఎమ్మెల్యే అందుబాటులో లేనందున కార్యాలయంలో అందజేసినట్లు పేర్కొన్నారు.