కర్ణాటకలో అప్పర్ భద్ర నిర్మాణం వద్దు
1 min read– వెనుకబడిన రాయలసీమ ను కరువు సీమగా మార్చొద్దు.
– రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ.
– ఏపీ రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శిఎం. జగదీష్.
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : కర్ణాటక రాష్ట్రం లో భద్రా నది ఫై ముప్పై టీఎంసీ ల సామర్థ్యం తో ప్రాజెక్టు నిర్మాణం కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం అంటే వెనుకబడిన రాయలసీమ ను కరువు సీమగా మార్చడమే నని,ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆపాలని వెనుకబడిన రాయలసీమ లో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు లు పూర్తి చేయాలని ఏపీ రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం. జగదీష్, మండల కార్యదర్శి శివశంకర్ లు పత్రిక ప్రకటన ద్వారా కోరారు.ఇప్పటికీ రాయలసీమ కు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని, కేవలం వరద జలాల మీదే ఆదార పడాల్సిన పరిస్థితి ఉన్నది. కేవలం ఎగువ రాష్ట్రాల నుండి వచ్చిన వరద నీళ్లపై ఆధారపడి ఉన్నామని, తెలంగాణ రాష్ట్రం అక్రమ ప్రాజెక్టు ల వల్ల నష్టం జరుగుతుంది అన్నారు.అప్పార్ భద్ర వల్ల తుంగ భద్ర నుండి వచ్చే నీళ్లు వచ్చే పరిస్థితి లేదని, అధిక వర్షాలు కురిసి ఫై రాష్ట్రాలలో వరదలు వస్తేనే శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లు వస్తాయని అన్నారు.రాయలసీమ నీటి వాటాలో ఇప్పటికీ పూర్తి స్థాయి ఇవ్వడం లేదని.ఎగువ రాష్ట్రాలలో అక్రమంగా ప్రాజెక్టు లు నిర్మిస్తే అడ్డుకొని అన్ని రాష్ట్రాల కు కేటాయింపు లు సక్రమంగా వినియోగించుకొనే పరిస్థితి కల్పించి జల వివాదాలు పరిష్కారం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనం కొరకు ఏకపక్షం గా నిధులు కేటాయించడం సమం జసం కాదని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వ నిర్ణయం పట్ల స్పందించి రాష్ట్ర ప్రయోజనం కొరకు పోరాడాలని కోరారు.ఏపీ లో జాతీయ ప్రాజెక్టు అయినా పోలవరం కు నిధులు ఇవ్వలేదని అన్నారు.జిల్లాలో వేదావతి, గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని, పెండింగ్.