మొద్దు నిద్రలో జోగుతున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ
1 min read– జంపాన శ్రీనివాస్ గౌడ్
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండకపోయినా నీటి తీరువా వసూళ్ల ప్రారంభానికి అనుమతి ఇవ్వలేదు అని రాష్ట్ర భూమి శిస్తు పరిపాలన చీఫ్ కమిషనర్ అని మొద్దు నిద్రలో జోగుతున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ తగు చర్యలుకు స్పందనలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కు సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ స్పందన లో వినతి పత్రము సమర్పించారని ఓ ప్రకటనలో తెలియజేశారు.ఎన్టీఆర్ జిల్లాలో డిసెంబర్ నెలలో ప్రారంభం కావలసిన నీటి తీరువా వసూళ్ళుఇప్పటివరకు ప్రారంభం కాలేదు.అనిరాష్ట్రవ్యాప్తంగా నీటి తీరువాను సచివాలయాల్లో చెల్లించే సదుపాయం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది .గ్రామపంచాయతీ పరిధిలోని ఆయకట్టు రైతుల వివరాలను ఏపీ సేవ పోర్టల్ లో ఇప్పటికే నమోదు చేసింది.రైతులు వారి ఖాతా నెంబర్లను తెలియజేస్తూ నీటి తీరువా రసీదు డిజిటల్ అసిస్టెంట్లు ఇచ్చే విధంగా ప్రభుత్వమురూపకల్పన చేసింది 2022 -23 సంవత్సరానికి నీటి తీరువా వసూళ్ళకు సంబంధించి మాడ్యూల్ ప్రారంభం కాలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండకపోయినా ప్రభుత్వానికి కావలసిన నీటి తీరువా బకాయిలు వసూళ్లకు భూమిశిస్తూ పరిపాలన (సిసిఎల్ఏ) కమిషనర్ తగు చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కి “స్పందనలో” విన్నవించడం జరిగిందిఅని, సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఓ ప్రకటనలో తెలియజేశారు.