జనసంద్రంగా మారిన తిరుణాల సంబరాలు
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : మండల కేంద్రమైన ప్యాపిలి పట్టణంలో వెలిసిన శ్రీ అవధూత వెంకటరెడ్డి తిరుణాల వేడుకలు శనివారం నుండి ప్రారంభమయ్యాయి. స్వామి వారి కలశం ఊరేగింపుతో ప్రారంభమైన ఈ వేడుకలు ఆదివారం రథోత్సవ ఊరేగింపుతో. కన్నుల పండుగలా ముగిశాయి. ఈ తిరునాళ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్, ఎగ్జిబిషన్ మండల కేంద్ర ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎగ్జిబిషన్లు బ్రేక్ డాన్సులుజాయింట్ వీల్స్ ద్వారా, ప్రజలు వినోదం పొందుతూ, తిరుణాల సంబరాలు జరుపుకున్నారు. ఆదివారం సాయంత్రం జరిగే రథోత్సవ దృశ్యాన్ని తిలకించడానికి మండల కేంద్ర ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. భక్తాదులు ప్రజలు ఈ వేడుకలకు తరలివచ్చి శ్రీ అవధూత వెంకట్ రెడ్డిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. కుల మతాలకతీతంగాజరిగిన ఈ తిరుణాల వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు భక్తాదుల రాకతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ శ్రీరాములు ఆధ్వర్యంలో, సర్కిల్ పోలీసులు. బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా తిరుణాల వేడుకల సంబరాలు అంబరానంటి, భక్తాదులు, ప్రజల రాకతో ప్యాపిలి జనసంద్రంగా మారింది.