జిల్లా కలెక్టర్ ఆదేశాలు బే ఖాతరు..
1 min readస్పందన కార్యక్రమం అట్టర్ ప్లాప్..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్పందన కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అధికారులు సమయం 11 గంటలు దాటిన తాసిల్దార్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్న తమకేమీ పట్టనట్టు మండల స్థాయి వివిధ శాఖల అధికారులు హాజరు కాకపోవడం విమర్శలకు తావిస్తుంది ప్రతి సోమవారం స్పందన కార్యక్రమానికి హాజరుకావాలని ఎటువంటి పనులు పెట్టుకోవద్దని హాజరు కాకపోతే చర్యలు ఉంటాయని స్వయంగా జిల్లా కలెక్టర్ ఆదేశించిన వీలు చూసుకుని స్పందన కార్యక్రమానికి హాజరు కావడం రిజిస్టర్లో సంతకం పెట్టడం ప్రతివారం షరా మామూలు అయిపోయింది కింది స్థాయి సిబ్బందికి ప్రభుత్వం సూచించిన సమయానికి విధులకు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చే మండల స్థాయి అధికారులు సమయానికి హాజరు కాకపోవడం కోసమేరుపు.