PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొణిదెల పాఠశాల విద్యార్థుల సైక్లతాన్ ర్యాలీ

1 min read

– సైక్లింగ్ తో శరీరానికి మంచి వ్యాయామం
– ఇన్చార్జి హెచ్. ఎం. సిల్వియా రేచల్
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ ఆదేశాల మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా నందికొట్కూరు మండలంలోని కొణిదెల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైద్య ఆరోగ్యశాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, నేషనల్ హెల్త్ మిషన్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ నిర్వహణలో పాఠశాల విద్యార్థులచే సైక్లతాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు సిల్వియా రేచల్ మాట్లాడుతూ నిత్యం సైక్లింగ్ చేయడం వలన శరీరానికి మంచి వ్యాయామం లభిస్తుంది అని అన్నారు. ఈ ర్యాలీని కొణిదెల 1 మరియు 2 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ లో విధులు నిర్వహిస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ గౌసియా బేగం, నీలిమ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులచే యోగాసనాలు సాధన చేయించి దైనందిన జీవితంలో యోగా ప్రాముఖ్యత ను వివరించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరక్టర్ శ్రీనాథ్ పెరుమాళ్ళ, ఉపాధ్యాయులు నీరజ, రఫి, శ్రీనివాస రెడ్డి, యళ్లన్న తదితరులు పాల్గొన్నారు.

About Author