NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్యే ఆర్థిక సహాయం

1 min read

పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి: ముస్లిం మత పెద్దలు సర్కాజి సర్పుద్దిన్, షావులి హమీద్ ల చేతుల మీదగా (ఎమ్మెల్యే 25 వెలు ),(మహమ్మద్ ఖాన్ 25 వెలు ) కలిపి యాభై వేల రూపాయలను అన్నమయ్య జిల్లా రాయచోటి మదీనా మస్జిద్ అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తున్న సమి వుల్లా కుటుంబ సభ్యులకు అందజేశారు.సమీ ఉల్లా పీలేరు రోడ్డు లో ప్రమాదానికి గురై వేలూరు సి ఎం సి హాస్పిటల్ నందు వైద్యం పొందుతున్న విషయం విధితమే .వారి కి స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి,వైకాపా నాయకులు బేపారి మహమ్మద్ ఖాన్ లు వైద్యం ఖర్చుల నిమిత్తం 50 వేల రూపాయలను ఆర్థిక సహాయంఅందజేశారు.ఈ సంధర్బంగా వారుమాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిది నుండి సమీ వుల్లాకు ఆర్థిక సహాయం అందేటట్లు చేస్తానని ఎమ్మెల్యే తెలియజేసినట్లు వారు తెలియజేశారు. బేపారి మహమ్మద్ ఖాన్ మాట్లాడుతు సమీ ఉల్లా మదీనా మస్జిద్ అంబులెన్స్ కు డ్రైవర్ గా ఉంటూ కరోనా లాంటి క్లిష్ట పరిస్థితులు, ఇతర సమయాలలో కానీ అనారోగ్యం,ప్రమాదాలు బారిన పడిన వారిని సకాలంలో వైద్య శాలలకు తరలించి ఎంతో మందికి ప్రాణా దాతగా మారారన్నారు. అటువంటి వ్యక్తి ప్రమదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడడం చాలా బాధాకరమన్నారు.వీరికి ఆ అల్లా దయ ,ప్రజల ఆస్సిశులతో త్వరగా కోలుకుని ప్రజలకు వారి సేవలు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజుర్ రహమాన్,ఎమ్మెల్యే పి ఏ నిసార్ అహమ్మద్, అజంతుళ్లా,తాలిబ్ ఖాన్,బేపారి జనివుల్లా ఖాన్, బేపారి అసద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

About Author