ఇప్ట్ రాష్ట్ర మహాసభల పోస్టర్ విడుదల
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలో సిపి ఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఇప్ట్ డివిజన్ అధ్యక్షులు పి. మౌలాలి ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభల పోస్టరు విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పి. మజీద్ మియా, జిల్లా నాయకులు పి. లాజరస్ మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలు శ్రీకాకుళం లో ఫిబ్రవరి 25, 26 తేదీలలో కళింగ భవనం నందు నిర్వహిస్తున్నారన్నారు. దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉండి ప్రభుత్వ రంగాలను ప్రైవేటు కరణ చేస్తూ కార్మికుల హక్కులను కాలరాసే నల్ల చట్టాలను చేసి కార్మికులను హరించే పద్ధతిలో పరిపాలన చేస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగ కార్మికులను పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా వేదిస్తుందన్నారు. ప్రభుత్వ రంగంలో కాంట్రాక్టు ఉద్యోగులకు కనీసం నెలకు రూ. 26 వేల ఇవ్వాలని సుప్రీంకోర్టు చెపుతున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పును లెక్కచేయడం లేదని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర మహాసభల్లో తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. కార్మికులను కాంట్రాక్టు ఉద్యోగులను ఐక్యం చేసి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కోశాధికారి ఎం. శిరీష, పిడిఎస్ యూ డివిజన్ కార్యదర్శి పి. మర్రి స్వామి తదితరులు పాల్గొన్నారు.