మయూర వాహన సేవ
1 min readపల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: శ్రీశైల మహా క్షేత్రంలో అంగరంగ వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు కనులు పండుగ జరుగుతున్నాయి స్వామి అమ్మవార్లకు మయూరవాహనసేవ ఆలయ అర్చకులు ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో మయూర వాహనంపై అధిష్టించి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. అనంతరం శ్రీశైలక్షేత్ర ప్రధాన వీధులలో మయూర వాహనాన్ని ఆలయ అధికారులు గ్రామోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోలాటం, చెక్కభజన, రాజబటులవేషాలు, జానపద పగటి వేషాలు, రవనృత్యం, బుట్టబొమ్మలు, తప్పెటచిందు వరప్పుడోలు, చెంచునృత్యం, నందికోలసేవ, ఢమరుకం, బండలు, శంఖం, పిల్లనగ్రోవి తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ఏర్పాటు చేసారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వేద పండితులు ఆలయ అధికారులు ఆలయ ఈవో ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు పాల్గొన్నారు.