క్షత్రియుల అభివృద్ధికి కృషి: డా. బలరామరాజు
1 min read– రాష్ట్రీయ క్షత్రియ సేవా సంఘం అధ్యక్షులు డా. బలరామరాజు
పల్లెవెలుగు వెబ్, అన్నమయ్య జిల్లా: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న క్షత్రియల సమగ్ర పురోగతికి, వారి అభివృద్ధికి, వివిధ రంగాల్లో సేవలు అందించేందుకు ఎస్ఆర్ఎస్ఆర్ సోషల్ టెక్ ఫౌండేషన్ ఉందని రాష్ట్రీయ క్షత్రియ సేవా సమితి అధ్యక్షులు డా!! బలరామరాజు, టీటీడీ క్షత్రియ సంఘం నాయకులు రుక్మాంగదరాజు, గురుప్రసాద్ రాజు, భాస్కర్ రాజు, నవీన్ రాజు, విజయరామరాజు పేర్కొన్నారు. ఎస్సార్ ఎస్సార్ ఎస్టియఫ్ ప్రతినిధులు మంగళవారం బలరామరాజు ను కలిసి తాము చెపడ్తున్న క్షత్రియ జనగననను గురించి వివరించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ క్షత్రియులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు, ఆరోగ్య రక్షణ కల్పించి, ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఆదుకునేందుకు క్షేత్రస్థాయిలో క్షత్రియ సోదరులందరినీ నేరుగా కలసి పూర్తి వివరాలను సేకరించి భవిష్యత్తు తరాలకు అందించి సహాయ సహకారాలతో పాటు పలు సూచనలు ఇవ్వనున్న ఎస్సార్ ఎస్సార్ సిబ్బంది ని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. టీటీడీ క్షత్రియ ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ ఎస్సార్ ఎస్సార్ ప్రతినిధులకు సంపూర్ణ సహకారాలు అందిస్తామన్నారు. వారి సేవలను కొనియాడారు. ఎస్సార్ ఎస్సార్ వారికీ శ్రీవారి ప్రసాదాలను, ప్రశంసా పత్రాలను అందించి శాలువా కప్పి అభినందించారు. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, క్షత్రియ నాయకుడు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు, గుండ్రాజు సుకుమార్ రాజు, రాజంపేటకు చెందిన క్షత్రియ నాయకులు విజయరామరాజు, ఎస్సార్ ఎస్సార్ ఎస్ టీ ఎఫ్ ఎన్యూమరేటర్స్ నరేష్ రాజు, చిరంజీవి రాజు, మురళి రాజు తదితరులు పాల్గొన్నారు.