పౌష్టికాహారంతో క్షయ వ్యాధి నివారించవచ్చు
1 min readపల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా: క్షయ వ్యాధి రోగులకు పౌష్టికాహారం అందించడం ద్వారా వ్యాధిని నివారించవచ్చునని వీరబల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ వినయ్ బాబు పేర్కొన్నారు. బుధవారం క్షయ వ్యాధి గ్రస్తులకు కడప లివిన్ డైయజ్ఞస్టిక్స్ ఎండి గాలివీటి వివేక్ రెడ్డి సహకారంతో పౌష్టికాహార కిట్లు అందచేశారు.మండలంలో క్షయ రోగులకు ఆరు నెలల పాటు పౌష్టికాహార కిట్లు అందచేసి చేయూతనందించడం శుభ పరిణామం అన్నారు. వైసీపీ నాయకులు గాలివీటి వీరనాగిరెడ్డి, నాగూర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. క్షయ రోగులు వ్యాధి సోకింది అని దిగులు పడకుండా ప్రభుత్వం అందిస్తున్న మందులు, పౌష్టికాహారం ,డాక్టర్ సలహాలు పాటిస్తే వ్యాది నుండి రోగులుకొలుకోవచ్చని తెలిపారు. వీఆర్డీఎస్ అధ్యక్షుడు సురేంద్రారెడ్డి మాట్లాడుతూ క్షయ బాధితులకు అండగా నిలిచి ఆత్మ విశ్వాసం కల్పించేందుకు దాతల సహకారంతో ప్రతి నెల పౌష్టికాహార కిట్ల పంపిణీ తమ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో క్షయ నియంత్రణ అధికారి హరి, తుమ్మల రమేష్, ఆసుపత్రి సిబ్బంది సుబ్బయ్య, ల్యాబ్ టెక్నిషియన్ కల్పన తదితరులు పాల్గొన్నారు.