వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది
1 min read– కర్నూలు న్యాయ రాజధాని ఎక్కడ… నంద్యాల టిడిపి పార్లమెంట్ అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి..
పల్లెవెలుగు వెబ్ గడివేముల : గడివేముల మండల కేంద్రంలో టిడిపి పార్టీ కార్యాలయాన్ని గురువారం గౌరు వెంకట్ రెడ్డి పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా గౌరు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ వైసిపి ఓటమి ఖాయమైందని అందుకే నారా లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారన్నారుగ్రామాలలో గ్రామ సారథులు కోకన్వీనర్ లంటూ రోజు కొత్తగా స్టిక్కర్లు వేసే కార్యక్రమం వైసిపి ఎమ్మెల్యేలు మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు 175 కు 175 సీట్లు గెలిచే సత్తా ఉన్నా వైసిపి నాయకులు శిక్షణ కార్యక్రమాలు అంటూ నెలకు కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తున్నారంటే రాష్ట్రంలో తిరిగి అధికారంలో రాలేమని వారికి తెలిసిపోయిందన్నారు మైనార్టీ బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారని.పాణ్యం ఎమ్మెల్యే గ్రూపు గొడవలకు కబ్జాలకు బెదిరింపులకు పాల్పడుతూ ఆదాయం కోసం ప్రజలను పీడిస్తున్నారన్నారు.మూడు రాజధానులు అంటూ సీమ ప్రజలకు కర్నూల్లో హైకోర్టు అంటూ ఊరడించి మోసం చేసి ఇప్పుడు విశాఖ పరిపాలన రాజధాని అంటూ రోజుకో అబద్ధపు మాటలు మాట్లాడుతూ కాలం గడుపుతున్నారని. ఆలయ భూములను కూడా వదిలిపెట్టడం లేదంటూ గ్రావెల్ తవ్వకాలు అనధికారకంగా చేపడుతూ దేవుడు భూములకు శఠగోపం పెడుతున్నారని వెలగమాను డాం ప్రతిపాదనను అటకెక్కించి మరమ్మతులకు గురైన అలగనూరు రిజర్వాయర్ ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేదని ఆరోపించారు బిల్లులు రాక గ్రామ సచివాలయాలు గత మూడు సంవత్సరాల నుండి సాగుతూ ఉన్నాయని పొదుపు మహిళలకు ఆసరా అంటు నాలుగు విడతలుగా ఒక్కరికి 10000 చొప్పున ఇస్తామని ఇప్పటివరకు రెండు నెలలైనా పథకాన్ని నగదు జమ చేయలేదని ఆరోపించారు వచ్చే ఎన్నికల్లో టిడిపి నాయకులు ప్రతి కార్యకర్త టిడిపి అధికారంలో వచ్చేలా కృషి చేయాలని పాణ్యం నియోజకవర్గంలో గౌరు చరిత రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు దేశం సత్యనారాయణ రెడ్డి. సీనియర్ టిడిపి నాయకుడు బిడుదురు సీతారామరెడ్డి. వంగాల శ్రీనివాస్ రెడ్డి.. పంట రామచంద్రారెడ్డి.. దుర్వేసి కృష్ణ యాదవ్.. బత్తుల సుభద్రమ్మ.. ఒడ్డు ప్రశాంతి. ఒడ్డు లక్ష్మీదేవి.. శ్రీనివాసులు.. ఎస్ ఏ రఫిక్. జయంత్ రెడ్డి.. దామోదరం నాగశేషులు.. శ్రీనివాస్ యాదవ్.. శంకర్ రెడ్డి.. మండల స్థాయి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.