మనం సేవా సంస్థ సేవలు అభినంద నీయం, ఆదర్శనీయం
1 min read– ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి : అన్నమయ్య జిల్లా లోని రాయచోటికి చెందిన మనం సేవా సంస్థ సేవలు అభినందనీయమని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు .రూ91 లక్షల అంచనా వ్యయంతో బెంగుళూరు కు చెందిన అపోటెక్స్ సహకారంతో.. యునైటెడ్ వే ఆధ్వర్యంలో.. రాయచోటి మనం SSC1983 సహకారంతో రాయచోటి ప్రభుత్వ జూనియర్ కళాశాల మౌలిక వసతుల కల్పన అభివృద్ధి పనులును ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించారు.ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన 14 తరగతుల నిర్మాణం,రెండు సైన్స్ ల్యాబ్ లు,ఆర్ ఓ యూనిట్ మరియు గది,మరుగుదొడ్ల నిర్మాణం,కళాశాల పెయింటింగ్, తరగతి గదులుపై మోరల్ ఆర్ట్,డెస్క్ ల రిపేర్ మరియు పెయింటింగ్, ఫర్నీచర్,సైన్స్ పరికరాలు,బాలికలకు హైజీన్ కిట్,ఆటోమేటిక్ స్కూల్ బెల్,55″ ఎల్ ఈ డి టివి పరికరాలను కళాశాలకు అంకితం చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ చదువుకున్న కళాశాలకు మనం 1983 బ్యాచ్ విద్యార్థులు లక్షలాది రూపాయలతో కళాశాలకు మౌళిక వసతును కల్పించడం అభినందనీయం,ఆదర్శనీయమన్నారు.పుట్టిన ఊరికి,చదువుకున్న కళాశాలకు సేవ చేయడం గొప్ప విషయమన్నారు.మనం సేవా సంస్థ చేపడుతున్న సేవా అభివృద్ధి కార్యక్రమాలుకు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. రాయచోటిని విద్యా హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. పి జి కేంద్రాన్ని ఏర్పాటు చేసి భవిష్యతు లో యూనివర్సిటీ గా అభివృద్ధి చేస్తామన్నారు.ఈ సందర్భంగా కళాశాల అభివృద్ధికి కృషి చేసిన మనం సంస్థ వారిని శ్రీకాంత్ రెడ్డి సత్కరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్,మనం సేవా సంస్థఅధ్యక్షుడు ప్రకాష్ బాబు, కార్యదర్శి జోషి,అపోటెక్స్ డైరెక్టర్ యోగాంజనేయ రెడ్డి,మాస్టర్స్ ఇన్ క్లినికల్ రీసెర్చ్ హాంకాంగ్ యూనివర్సిటీ డాక్టర్ గౌతమ్ పూజారి, అపోటెక్స్ కార్యదర్శి ఇంద్రజ్యోతి బోస్,యునైటెడ్ వే సిఈఓ రాజేష్ కృష్ణన్,మదనపల్లె పరిశీలకులు హాబీబుల్లా ఖాన్,బేపారి మహమ్మద్ ఖాన్, ఫయాజ్ అహమ్మద్,పి ఆర్ టి యు రాష్ట్ర క్రమశిక్షణా సంఘ అధ్యక్షుడు శ్రీనివాసరాజు, వి ఆర్ విద్యా సంస్థల అధినేత వి ఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.