దూదేకుల కులానీకి ..ఎమ్మెల్సీ ఇవ్వాలి
1 min read– ఎంతో మంది పేద మైనారిటి మహిళల వివాహనికి హార్దిక సహయం అందించిన డా. ఆకుమళ్ళ. నాని
నాని జీవితం యువతకు ఆదర్శం
– 35 సంవత్సరాలుగా ఓకే రాజకీయ పార్టీ కుటుంబాన్ని నమ్ముకునీ ముందుకు సాగుపోతున్న డా. ఆకుమళ్ళ. నాని కుటుంబ సభ్యులు
నాని సేవలకు 200 లకు పైగా అవార్డు లు నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులు అందుకొనీ చరిత్ర లో ఆంధ్ర సోను సూద్ గా బిరుదు పొందిన డా. ఆకుమళ్ళ. నాని
– ప్రజాసేవే లక్ష్యం గా ప్రజా సంక్షేమమేమార్గంగాముందుకుదూసుకుపోతున్న డా. ఆకుమళ్ళ. నాని
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: విజయవాడ కేంద్ర బిందువుగా దూదేకుల సంఘం నుంచి రాష్ట్ర ఎంబిసి గౌరవ అధ్యక్షుడు డా.ఆకుమళ్ళ నాని వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో 11 సంవత్సరాలుగా కొనసాగుతూ పార్టీలో చురుకైన నాయకులుగా పనిచేస్తూ రాష్ట్రంలో 21 ఏళ్లగా నాని సేవా దళ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందిన నానికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని పలువురు విశ్లేషకులు కోరుతున్నారు కరోనా ఫస్ట్ వేవే, సెకండ్ వేవ్ కష్టకాలంలో తన ప్రాణల సైతం లెక్క చేయకుండా 30, 000 కుటుంబాలకు నిత్య అవసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఇప్పటి వరకు 70 సార్లు రక్తదాన చేసీ రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేసి యువతకు ఆదర్శం గా నిలిచారు ఎంతోమంది పేద విద్యార్థులకు తన వంతు ఆర్థిక సాయం చేస్తూ వారికి అండగా నిలిచారన్నారు కోవిడ్ కష్టకాలంలో వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు పారి శుద్య కార్మి కులకు 24,980 మందికి శానిటైజర్స్ ఫ్రూట్స్, హెల్తి ఫుడ్ బ్రెడ్లు, చీరలు పంపిణీ చేసి వారికి అండగా నిలుస్తూ మానవత్వం చాటుకొని వచ్చారన్నారు ఆక్సిజన్ దొరకని టైంలో ఆక్సిజన్ కొనుగోలుకు తన వంతు ఆర్థిక సాయం చేశామన్నారు 40 సంవత్సరాలుగా ఒకే పార్టీ కుటుంబాన్ని నమ్ముకుని 11 ఏళ్లగా వైసిపి పార్టీ కోసం పని చేస్తూ తన వంతు పార్టీ గెలుపు కోసం కృషి చేశామన్నారు వ్యతిరేక పార్టీల కంచుకోటలను సైతం బద్దలు చేసి స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేశామన్నారు ఎంబీసీ గౌరవ అధ్యక్షుడిగా గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కార దిశగా ఆయా ప్రాంతాల స్థానిక నాయకులతో సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తూ వచ్చారు ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో వైసీపీ హై కమాండ్ వారు నాని సేవలను గుర్తించి దూదేకుల కులం నుంచి కుల మత పెద్దలు మరియు కొందరు విశ్లేషకులు రాష్ట్ర ఎంబీసీ గౌరవ అధ్యక్షుడు డా. ఆకుమళ్ళ.నానిని ఎంపిక చేయాలని ఎమ్మెల్సీ పదవి ఇవ్వ వలసినది గా కోరుతున్నారు.