యువత వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి చేసుకోవాలి
1 min read– సెట్ వెల్ సీఈవో యo.డి.హెచ్. మెహరాజ్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : సెట్ వెల్ సీఈవో ఎంబిహెచ్ మహారాజ్ వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి చేసుకోవాలని సెట్ వెల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి యం.డి.హెచ్. మెహరాజ్ కోరారు. రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ, ఏలూరు జిల్లా కలక్టరు వారి ఆదేశములను అనుసరించి జిల్లా యువజన సర్వీసుల శాఖ , సెట్ వెల్ వారి ఆధ్వర్యములో శుక్రవారం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల , శనివారపుపేట , ఏలూరు నందు 9వ మరియు 10వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు ” వ్యక్తిత్వ వికాసం మరియు కెరీర్ గైడెన్సు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కెరీర్ కౌన్సిలర్ ఆర్.విజయ కుమార్ మాట్లాడుతూ విద్యార్ధులు జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి లక్ష్యం కృషి ఉంటే ఋషులు అవుతారని, పట్టుదలతో చదివి జ్ఞానం సంపాదించాలని జ్ఞానంతో లక్ష్యాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ చార్జి ప్రదానోపాద్యాయులు బి. రాజేశ్వరి, లెక్కల మాస్టరు కె.యస్.వి.కె. రాజ్ కుమార్, సెట్ వెల్ మేనేజర్ పి.వి.ఎన్. సత్యనారాయణ, ఎ.ఓ. కె.జె. కెనడి మరియు పాఠశాల అధ్యాపక సిబ్బంది మరియు పాఠశాల విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు .