NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : అదొనిలో  ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలియజేస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులపై అక్రమంగా పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని పత్తికొండ సీపీఐ కార్యదర్శి డి.రాజా సాహెబ్ కోరారు.శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ,ఎమ్మెల్సీ,ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయ పట్టభద్రుల అధికార పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం ప్రచారం చేస్తున్న RJD ప్రతాపరెడ్డి ని తక్షణమే సర్వీసు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.ఆర్ జే డి ప్రతాప్ రెడ్డి విద్యాశాఖ అధికారా? లేక వైసిపి పార్టీ నాయకుడా? అని సూటిగా  ప్రశ్నించారు.కర్నూలు…ప్రభుత్వ విద్యాశాఖ అధికారి అయిన కడప RJD ప్రతాప్ రెడ్డి ఆదోని జ్యోతిర్మయి కాలేజీలో నిన్నటి  రోజు ఆదోని డివిజనల్ స్థాయి HM’s ,MEO’s ల సమావేశం పెట్టి అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉంటే,ప్రభుత్వ అధికారులు ఎన్నికల ప్రచారం నిర్వహించడం ఏంటనీ,ప్రశ్నించి, నిరసన తెలియజేసిన ఏఐఎస్ఎఫ్, నాయకులపై పోలీసులను ఉసిగొల్పి లాఠీఛార్జ్ చేయించి అక్రమ కేసులు బనాయించడం హేయమైన చర్య అని అన్నారు.అలాగే వన్ టౌన్ సి.ఐ విక్రమసింహ అత్యుత్సాహం ప్రదర్శించి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సోమన్న పై విచచనారహితంగా దాడికి పాల్పడ్డాడు అని అన్నారు.ఈ దాడిలో సోమన్న కంటికి గాయం అయినప్పటికీ దుర్మార్గంగా అరెస్టు చేశారన్నారు. నిరసనలో పాల్గొన్న  ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి జి.రంగన్న,  ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమన్న, జిల్లా సహాయ కార్యదర్శి షాపూర్ భాషా, విజేంద్ర, ఉపాధ్యక్షుడు శరత్ లను నర్బందిన్చడం శోచనీయం అన్నారు. అక్రమ కేసులు ఎత్తివేయాలని అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను తీవ్రంగా కొట్టి గాయపరిచిన వన్ టౌన్ సి.ఐ విక్రమసింహను సస్పెండ్ చేయాలి.

About Author