బాలలకు.. భవిష్యత్నిద్దాం..
1 min read– ఆపరేషన్ ముస్కాన్‌లో 29 మందికి విముక్తి
– కడప ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్
పల్లెవెలుగు వెబ్, కడప: బాలలకు బంగారు భవిష్యత్నిద్దామని కడప జిల్లా ఎస్పీ కేకేఎస్ ఎన్ అన్బురాజన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు … ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా జిల్లాలో 29 మంది చిన్నారులకు విముక్తి కల్పించామని ఆయన పేర్కొన్నారు. బుధవారం కడప వన్‌టౌన్ పరిధిలో ‘ ఆపరేషన్ ముస్కాన్’లో భాగంగా విముక్తి కల్పించిన 29 మంది చిన్నారులకు ఎస్పీ అన్బురాజన్ చాక్లెట్లు, బిస్కెట్లు అందజేశారు. ఆ తరువాత చిన్నారులతో కొంత సేపు ముచ్చటించారు. బాల బాలికల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఎస్.పి మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కోరారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న నినాదాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడా బాల కార్మికులు ఉండకూడదన్నారు. ఎవరైనా బాల కార్మికులను పని లో పెట్టుకుంటే చట్టరీత్య చర్యలు తీసుకుంటామన్నారు కార్యక్రమంలో కడప డి.ఎస్.పి బి. సునీల్, కడప వన్ టౌన్ సి.ఐ సత్యనారాయణ, తాలూకా సి.ఐ నాగభూషణం, ఎస్.ఐలు మధుసూదన్ రెడ్డి, హాషం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.