బాలసాయిబాబా ఆశ్రమంలో…శివరాత్రి వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు:మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని.. కర్నూలు నగరంలోని తుంగభద్ర నదీ తీరమున వెలిసిన బాలసాయి బాబా ఆశ్రమంలో శనివారం శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నట్లు బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్టు చైర్మన్ టి. రామారావు తెలిపారు. ఉదయం 6 గంటలకు గణపతి పూజ, బాలసాయిబాబా గారికి పంచామృత అభిషేకములు, అర్చనలు, పూజాధికములు, సాయంత్రం 6.30 గంటలకు ప్రథమ యామున గణపతి పూజ , మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అదేవిధంగా 2వ యామమున రాత్రి 9.14 గంటలకు శివలింగమునకు అన్నాభిషేకం, అర్చనలు పూజాభిషేకము , 3వ యామమున రాత్రి12.21 గంటలకు లింగోద్బవ సమయమున విశేష ద్రవ్యములతో అభిషేకములు, అర్చనలు, పూజాధికములు, 4 యామమున ఉదయం 3.28 గంటలకు శివునికి అభిషేకములు, గణపతి హోమము, రుద్ర హోమము, మహా పూర్ణాహుతి, అనంతరం కలశోద్వాసవతీ తీర్థ ప్రసాద వితరణ మహాదాశీర్వచనము ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్టు చైర్మన్ టి. రామారావు వెల్లడించారు.