శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి విరాళం
1 min readపల్లెవెలుగు వెబ్, కౌతాళం: కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో వెలిసిన.. శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన రాజగోపుర నిర్మాణం కొరకు గిద్దలూరు ( ప్రకాశం) వాస్తవ్యులు కనుమర్లపూడి సుబ్రహ్మణ్యం లక్ష్మీదేవి & కుటుంబ సభ్యులు వారు Rs.110001/- విరాళంగా చెల్లించియున్నారు. దాతలకు దేవస్థాన ఆలయ అధికారులు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి,బాండు పేపర్ మరియు శ్రీ స్వామి వారి ఫోటోను అందించి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో సీనియర్ అసిస్టెంట్ రామలింగారెడ్డి, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.