‘యిండిగ ట్రావెల్స్’ ఆధ్వర్యంలో .. ప్రసాద వితరణ..
1 min readశివనామ స్మరణతో వేలాదిగా పాల్గొన్న శివ భక్తులు..
దైవాశీస్సులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆశీస్సులతోనే సేవ కార్యక్రమాలు.. యిండిగ రాజు
పల్లెవెలుగు, ఏలూరు: ఏలూరుజిల్లా ముసునూరు మండలంలో హర హర మహాదేవ శంభో శంఖరా అంటూ భక్తుల శివనామ స్మరణతో ముసునూరు, పెదవేగి మండలాల మధ్యలో ఉన్న బలివే రామలింగేశ్వర స్వామి ఆలయం శనివారం మారుమ్రోగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బలివే రామస్వామిని దర్శించి శివ భక్తులు పూజలు చేశారు. ఎన్నో ఏళ్లకు అరుదుగా శనివారం శని త్రయోదశి కలయికతో రెండూ ఒకేసారి రావడం అదేరోజు మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడం భక్తుల పాలిట అరుదైన వరంగా మారింది. దీంతో భక్తులు శనివారం బలివే రామలింగేశ్వర స్వామిని దర్శించడానికి లక్షల్లో తరలి వచ్చారు. బలివే అంతా భక్తులతో శనివారం కిట కిటలాడింది. ఈరోజు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బలివే ఉత్సవాలకు వెళ్లే 5,000 వేల మంది భక్తులకు (యిండిగ ట్రావెల్స్ అధినేత) యిండిగ రాజు అల్పాహారం ప్రారంభించి సుమారు 5 వేల మందికి చక్ర పొంగలి, పులిహోర , కట్ట పొంగలి, మజ్జిగ మంచినీరు ప్రసాద వితరణ చేశారు, మార్గం గుండా రాకపోకలు సాగించే భక్తులకు కండ్రిక గూడెం ప్రధాన రహదారి నాలుగు కుడలిలో టెంట్ హౌస్ ఏర్పాటు చేసి స్వయంగా భక్తులకు అందించారు, ఈయన ఇ సేవా కార్యక్రమాన్ని గత తొమ్మిది సంవత్సరాల నుండి ప్రారంభించి నేటికీ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా గత 30 సంవత్సరాల నుండి యిండిగ ట్రావెల్స్ కుమ్మర రేవు ప్రాంతంలో ఆఫీసు ఏర్పాటు చేసి. అన్ని రాష్ట్రాలకు. పలు రకాల దేవాలయాలకు శబరిమల, షిరిడి, రామేశ్వరం, కేదార్, బదరి, కాశి స్పెషల్ బస్సులు దైవ దర్శనాలు చేసుకునే భక్తులకు బస్సులు ఏర్పాటు చేసి భక్తులకు, ప్రయాణికులకు సౌకర్యంతమైన మరియు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తూ దైవ సేవలో ప్రజాసేవను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా గత 20 సంవత్సరాలు నుండి అయ్యప్ప మాల భక్తులకు. 40 రోజుల దీక్షాపరులకు అన్న ప్రసాద వితరణాన్ని తన ఆఫీస్ ప్రాంగణంలో అందిస్తున్నట్లు తెలిపారు. పడి పూజలకు, అభిషేకములకు, స్వామివార్ల విగ్రహములు, ఉచితంగా అందిస్తున్నట్లు యిండిగ రాజు (గురు స్వామి) తెలిపారు. తాను సంపాదించిన దానిలో తగినంత గుళ్ళు గోపురాలకు. దేవాలయాలకు దానధర్మాలు అందిస్తుంటున్నట్లు తెలిపారు. దేవుడు ఆశీస్సులతో తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు చలం, చల్లాయమ్మ పుణ్య దంపతుల ఆశీస్సులతో ఇ దైవ కార్యక్రమాలు మరియు యిండిగ ట్రావెల్స్ ద్వారా ప్రయాణికులకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించిన శివునికి మహాశివరాత్రి సందర్భంగా శతకోటి వందనాలు తెలియజేశారు.