మరుగుదొడ్డి.. ఫిర్యాదుపై అధికారుల్లో స్పందన
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: గ్రామంలో ఉన్న మరుగుదొడ్డిని తొలగించాలని ఓవ్యక్తి స్పందనలో ఫిర్యాదు చేశారు. అందుకుగాను స్పందనపై అధికారుల్లో స్పందన వచ్చింది. మిడుతూరు మండల పరిధిలోని అలగనూరు గ్రామంలో పెద్ద పాపయ్య అనే వ్యక్తి గ్రామంలో ఉన్న మరుగుదొడ్డిని తొలగించాలని ఆయన స్పందనలో ఫిర్యాదు చేశారు.అందుకుగాను గ్రామంలో ఉన్న మరుగుదొడ్డిని పరిశీలించేందుకు ఈఓఆర్డి ఫక్రుద్దీన్,ఏఎస్ఐ సుబ్బయ్య గ్రామానికి వచ్చి వాటిని పరిశీలించారు.కానీ ఆప్రాంతంలో ఉన్న ప్రజలు మరుగుదొడ్డిని తొలగించవద్దని అధికారులకు తెలియజేశారు. సమస్యకు పరిష్కరించకుండా కొంతమంది వారికి ఆ మరుగుదొడ్డి ఉపయోగమున్నదని వారు తొలగించుటను వ్యతిరేకించారు.కావున ఈ విషయాన్ని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఈఓఆర్డి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎన్.అనురాధ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.