కొండపేటలో ఘనంగా పెద్దమ్మ జాతర
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: పెద్దమ్మ జాతరలో పాల్గొని అమ్మవారికి సారే సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు సతీమణి కాటసాని జయమ్మ గారు కుమారుడు కాటసాని ఓబుల్ రెడ్డి గారు.బనగానపల్లె నియోజకవర్గ ప్రజలందరూ సుఖ, సంతోషాలతో ఉండాలని మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కావాలని అమ్మవారిని కోరుకున్న బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారి దంపతులు.కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు.అమ్మవారికి బోనాలు సమర్పించిన బనగానపల్లె పట్టణ బానుముక్కల గ్రామ ప్రజలు.బనగానపల్లె పట్టణంలోని కొండ పేటలో 11 సంవత్సరాల అనంతరం పెద్దమ్మ గ్రామ జాతరను గ్రామ పెద్దలు నిర్వహించారు. పెద్దమ్మ అమ్మవారికి సారే సమర్పించి బనగానపల్లె నియోజకవర్గం కాటసాని రామిరెడ్డి గారు సతీమణి కారసాని జయమ్మ గారు కుమారుడు కాటసాని ఓబుల్ రెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించినారు. అనంతరం భానుముక్కల గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇచ్చిన విందుకు ఎమ్మెల్యే కారు స్వామి రామిరెడ్డి గారు కుమారుడు కాటసాని ఓబుల్ రెడ్డి గారు అవుకు మండల వైయస్సార్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ 11 సంవత్సరాల అనంతరం భానుముక్కల గ్రామంలో పెద్దమ్మ జాతర నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. పెద్దలు అందరూ కలిసికట్టుగా ఈ గ్రామ జాతరను విజయవంతం చేయడం చాలా హర్షనీయమని చెప్పారు. బనగానపల్లె నియోజకవర్గం లో పాడిపంటలు సుభిక్షంగా పండి నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే ప్రజల మనిషి అయినా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఆ అమ్మవారిని వేడుకోవడం జరిగిందని చెప్పారు. ట్రాఫిక్ సమస్య లేకుండా గట్టి పోలీస్ బందోబస్తు మధ్య ఏర్పాటు చేయడం పోలీసులు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అవుకు మండల వైయస్సార్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి,బనగానపల్లె మండల వైయస్సార్ పార్టీ కన్వీనర్ గుండం నాగేశ్వర్ రెడ్డి, జిల్లా వైఎస్ఆర్ పార్టీ ప్రచార కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు బండి బ్రహ్మానందరెడ్డి ,జిల్లెళ్ళ శంకర్ రెడ్డి, అంబటి రవి, అమర్నాథ్ రెడ్డి ఫెరోజ్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.