PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మున్సిపాలిటీలో మహిళా దళిత ఉద్యోగులపై వేధింపులు

1 min read

– మహిళా ఉద్యోగిని సునీత ఆత్మహత్యాయత్నం పై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలి.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మహిళా ఉద్యోగిని సునీత ఆత్మహత్యాయత్నంపై సెట్టింగ్ జడ్జిచే సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని బహుజన సమాజ్ పార్టీ నందికొట్కూరు అసెంబ్లీ ఇన్చార్జి ఎల్ స్వాములు డిమాండ్ చేశారు.బుధవారం తహశీల్దార్ రాజశేఖర్ బాబుకు వినతిపత్రం ఇస్తూ ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ నందికొట్కూర్ మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సునీత పై అదే కార్యాలయంలో పనిచేస్తున్న పై అధికారులు ఆమె విధులకు ఆటకం కలిగిస్తూ ఆమె హక్కు లను కాలరాస్తూ మానసిక క్షోభ కు గురి చేయడం ఎంతవరకు సమంజసం మని సునీత ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు వెలికి తీసి బాధ్యులైన పై అధికారులపై చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు .గతంలో కూడా మున్సిపల్ అధికారులు ఒత్తిడి వలన పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఇంత జరుగుతున్న ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.మున్సిపల్ కార్యాలయంలో దళిత మహిళా ఉద్యోగులను టార్గెట్ చేస్తూ వేధింపులకు గురి చేయడం రోజురోజుకు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే మున్సిపల్ కార్యాలయంలో సునితపై వేధింపులకు గురి చేస్తూ వివక్షత చూపుతున్న అధికారులపై సిట్టింగ్ జడ్జి చే సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేదంటే బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో సుమంత్. తిమోతి. స్వాములు. లడ్డు. దావీదు .దయాకర్. శ్రీకాంత్. చిన్న .సుక్కు .ఇర్మియ. గీదొన్. తదితరులు పాల్గొన్నారు.

About Author