సామజిక సేవలో ముందుటాం:ఎస్ఎఫ్ఐ
1 min readపల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: విద్యార్థి,విద్యారంగా సమస్యల పరిష్కారానికి పోరాటాలతో పాటు సామాజిక సేవలోను ముందుటామని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు వీరన్న తెలిపారు.గురువారం స్థానిక మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి చదువుతున్న 17మంది పేద విద్యార్థులకు ఎస్ ఎఫ్ ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో పరీక్షలకు ఉపయోగపడే ప్యాడ్స్ (పరీక్ష రాసేందుకు ఉపయోగపడే అట్టలు)మరియు పెన్నులను ఉచితంగా అందజేశారు.ఈ సందర్భంగా పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు అయ్యాస్వాములు,యుటిఎఫ్ నాయకులు ముఖ్య అతిధులుగా హాజరై మాట్లాడుతూ విద్యార్థి సంఘాలు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే కాక సామాజిక స్పృహలో భాగంగా సామాజిక సేవ కార్యక్రమాలు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల చదువుకు తమ వంతుగా తోడ్పాటు అందించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు ఖాజా, సహాయ కార్యదర్శి సలీం, ఉపాధ్యక్షులు నంది, యుడిఎఫ్ నాయకులు నరసింహ, బాబు, రామన్, జిక్రియ, బతకన్న, రామకృష్ణ, ఎస్ఎఫ్ఐ నాయకులు వీరాంజనేయులు, మురళి, చిరంజీవి, షాహిద్, మోహన్, చత్రపతి, ఉదయ్, సిరాజ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.