మండల సర్వ సభ్య సమావేశం
1 min read– మండలంలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలి.. ఎంపీపీ నాగమద్దమ్మ
పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండడంతో ఎమ్మెల్యే అధ్యక్షతన జరగాల్సిన మండల సర్వసభ్య సమావేశం గురువారం నాడు మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం మండల అధ్యక్షురాలు శ్రీమతి ఏ.నాగ మద్దమ్మ అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు వారి ప్రగతి సాధించిన నివేదికలు . ముఖ్యంగా ఈ సమావేశంలో జడ్పిటిసి ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి జిల్లా. పరిషత్ పాఠశాలలో పని చేస్తున్న హింది పండిట్ లను వేరే మండలాలకు డెప్యూటేషెన్ ఎలా వేస్తారని మండల విద్యాధికారి గారిని అడిగారు. వెంటనే పై అధికారులకు సదరు డెప్యూటేషెన్ లను రద్దు పరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు మరియు ఆర్ అండ్ బి వారికి మండల పరిధిలోని రోడ్లు చాల అధ్వానంగా తయారైనాయని వెంటనే తగు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రాబోయేవేసవి కాలములో మంచినీటి ఏద్దడి రాకుండ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసి సభ్యులు, సర్పంచులు, ఎంపిడిఓ, విజయసింహారెడ్డి.. తాసిల్దార్ శ్రీనివాసులు , ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.