నిర్ణీత ధరలకే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి
1 min read– బ్రాండ్ల మద్యం అమ్మకాలు స్టాక్ నిలువకు సంబంధించిన తనిఖీలు
– డిస్ట్రిక్ట్ ప్రోహిబిషన్ మరియు ఎక్స్చేంజ్ అధికారి ఎం రవి కుమార్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: బనగానపల్లె మండలంలో మద్యం దుకాణాలలో నిర్ణీత రేటికే మద్యం బాటిళ్లు అమ్మకాలు జరుగుతున్నాయని జిల్లా డిస్ట్రిక్ట్ ప్రోహిబిషన్ మరియు ఎక్స్చేంజ్ అధికారి ఎం రవి కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లాలోని బనగానపల్లె మండల పరిధిలోని నందవరం ప్రభుత్వ మద్యం దుకాణాను, బనగానపల్లె టౌన్ లోని బస్టాండ్ ఎదురుగా గల దుకాణను, యాగంటి రోడ్డులోని తమ్మడపల్లె రోడ్ లోని కర్నూల్ రోడ్ లో గల ప్రభుత్వ మద్యం దుకాణాలలో ఆకస్మికంగా విజయవాడ కమిషనర్ వారి ఆదేశాల మేరకు జిల్లా డిస్ట్రిక్ట్ ప్రోహిబిషన్ మరియు ఎక్స్చేంజ్ శాఖ ఆధ్వర్యంలో ఎం రవి కుమార్ రెడ్డి తన సిబ్బందితో కలిసి ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. మద్యం దుకాణం సూపర్వైజర్లు సేల్స్ మేన్ లకు అమ్మకాలు మరియు స్టాక్ నిలువలకు సంబంధించిన విధివిధానాల గురించి సూచనలు ఇవ్వడం జరిగిందని వారు చెప్పారు. కల్తీ మద్యం గురించి పరీక్షలు నిర్వహించి రసాయనిక పరీక్ష కోసం నమూనాలను సేకరించి నమూనాలను రసాయనిక పరీక్షలకు పంపడం జరిగిందని చెప్పారు. లైసన్ మరియు నౌకర్ నామదారులకు రెస్టారెంట్ మరియు భారీ యొక్క నియమ నిబంధనలు వ్యాపార సమయాలను తప్పక పాటించమని తగు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్చేంజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం అస్లాం బిగ్, బి వెంకటేశ్వర్లు కానిస్టేబుల్ బలరాం కల్పన ప్రభుత్వం మద్యం దుకాణాల సిబ్బంది పాల్గొన్నారు.