నేడు ఏలూరుకు చంద్రబాబు రాక
1 min read– చంద్రబాబు పాల్గొనే సభకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: 24 తేది శుక్రవారం జరుగు జోన్ 2 సమావేశానికి చంద్రబాబు నాయుడురానున్న నేపధ్యంలో ఏలూరు బైపాస్ లో స్వరాజ్ షోరూం ఎదురుగా చొదిమెళ్ళ పరిధిలో జరుగు సభా స్థలం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను టిడిపి నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ ఈ సమావేశంలో 3000 మంది టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు ప్రభుత్వ వ్యతిరేకతను ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు వ్యవహరించాల్సిన వ్యూహాత్మక అంశాలపై చంద్రబాబు నాయుడు దశ దిశ నిర్దే నిర్దేశం చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో వివిధ పదవుల్లో 62 మంది నేతలను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వనున్నారు అని అన్నారు. మొత్తం 35 నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు సమావేశంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మాజీ మంత్రివర్యులు పితాని సత్యన్నారాయణ, దెందులూరు మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, మాజీ ఏలురు పార్లమెంటు సభ్యులు మాగంటి వెంకటేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ తెదెపా భాద్యులు బడేటి రాధాకృష్ణ రెడ్డి సూర్యచంద్రరావు, ఎన్ టి ఆర్ ప్రసాద్, కరణం పెద్దిరాజు, దూసనపూడి పుల్లయ్యనాయుడు, శిరిబత్తిన వీర వెంకట సత్యన్నారాయణ, షేఖ్ మోరా సాహెబ్, ఇమ్మణి గంగాధర్, కడియాల రవిశంకర్, బెజ్జం అచ్చాయమ్మ, కొక్కిరిగడ్డ జయరాజు, రామిశేట్టి బుజ్జి గోపాల్, పాలి ప్రసాద్, మరియు తెలుగుదేశంపార్టీలో వివిధ హోదాలో ఉన్న ఇతర తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. క్లస్టర్లు,యూనిట్లు, సెక్షన్లు నేతలను ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో నియమించారు వారికి అవసరమైన శిక్షణ రేపు ఇవ్వనున్నా రు.