అంగన్వాడీ వర్కర్స్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ : అపరిష్కృతంగా ఉన్న అంగన్వాడీ వర్కర్స్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏ ఐ టి యుసి జిల్లా డిప్యూటి కార్యదర్శికృష్ణయ్యప్రభుత్వాన్ని కోరారు.శుక్రవారంఅంగన్వాడివర్కర్స్&హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పత్తికొండ ఐ. సి .డి .ఎస్, సి. డి .పి .ఓకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఎంతో కాలంగా అంగన్వాడీ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు.అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలలో అంగన్వాడి వర్కర్స్ కు సంబంధించి సెంటర్లకు సరిపోయేంత బడ్జెట్ను పెంచి ఐసిడిఎస్ ను పరిరక్షించాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ తాలూకా నాయకురాలు రత్నమ్మ, ప్రమీల ఏఐటియుసి జిల్లా డిప్యూటీ కార్యదర్శి కృష్ణయ్య ,ఏఐటీయూసీ తాలూకా అధ్యక్ష కార్యదర్శులు జి. నెట్టేకంటయ్య ,ఎం. రంగన్న డిమాండ్ చేశారు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గ్రాచ్యుటీని తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రంలో ఇస్తున్నటువంటి వేతనం కంటే వెయ్యి రూపాయలు పెంచి ఇస్తామని సీఎం గారు పాదయాత్రలో ప్రకటన చేశారు తెలంగాణలో వేతనాలు పెంచి సంవత్సరం దాటిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో సీఎం గారు ఇచ్చిన హామీని మరిచిపోయారు తక్షణమే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కి వేతనాల పెంపుదలకు శ్రీ శిశు సంక్షేమ శాఖ నిర్వహించడానికి సరిపోయేంత బడ్జెట్ను మార్చి నెలలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ని పెంచాలని సమస్యల పరిష్కారం కోసం మున్ముందు పెద్దయెత్తున ఉద్యమిస్తామని హెచ్చ రించారు.ఈమేరకు తమ డిమాండ్.