‘ ఆపరేషన్ ముస్కాన్ ’.. 455 బాలలకు విముక్తి
1 min read–జిల్లా ఎస్పీ డా. ఫక్కీరప్ప
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : జిల్లాలో వీధి, అనాథ, తప్పిపోయిన బాలలను సంరక్షించేందుకు రాష్ట్ర డి.జి.పి ఆదేశాల మేరకు జరిగిన “ ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్ 19 ” కార్యక్రమం రెండవ రోజు కొనసాగిందని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గురువారం తెలిపారు. ‘ఆపరేషన్ ముస్కాన్’ లో భాగంగా జిల్లాలో 455 మంది (బాలురు 396, బాలికలు 59) బాలలను రెస్క్యూ చేయడం జరిగిందన్నారు. రెస్క్యూ చేసిన 455 మంది బాల,బాలికలను తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు, ఇతర శాఖల సిబ్బంది తో కలిసి ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు. రైల్వే స్టేషన్ లు, బస్ స్టాండ్ లు, హోటల్ లు, డాబాలు, గ్యారేజీలు, పరిశ్రమలు, వర్క్ షాపులు, ఇతర పని చేసే ప్రదేశాలలో బాల కార్మికులుగా మార్చబడిన బాల, బాలికలను పోలీసులు రెస్క్యూ చేసి ICDS, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ , CWC / JJB సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి వారిని వారి యొక్క తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. పోలీస్ అధికారులు బాల, బాలికలకు అల్పాహారం, పండ్లు, బిస్కెట్లు అందజేశారు. థర్మల్ స్కానర్ ద్వారా టెంపరేచర్ చెక్ చేయించి, వారికి కోవిడ్ రాపిడ్ టెస్ట్ లు నిర్వహించారు.