గంజిహళ్లి ఉరుసు మహోత్సవంలో భారీ బందోబస్తు ఏర్పాటు
1 min readపల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: గోనెగండ్ల మండల పరిధిలోనే గంజిహళ్లి గ్రామములో శ్రీశ్రీశ్రీ సద్గురు మహాత్మా బడేసాహెబ్ తాత వారి ఉరుసు మహోత్సవంకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్ఐ. తిమ్మారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ గంజిహళ్లి గ్రామములో 25,26,27వ తేదీల్లో జరుగుతున్న ఉరుసు మహోత్సవంకు ఎస్ఐ తిమ్మారెడ్డి గ్రామములో ముందస్తుగా పర్యటించి వాహనాలు పార్కింగ్ స్థలం పరిశీలించారు. అలాగే ముఖ్యంగా గ్రామానికి సింగిల్ రోడ్డు కావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఒకదాని తర్వాత వెళ్లాలని, బైకు పై వేళ్ళు వారు ముగ్గురు వెళ్లరాదని ఏక్సిడెంట్లు కాకుండ వెళ్లాలన్నారు. దర్గా సమీపంలో భక్తులతో రద్దీ ఉండడంతో దొంగల సంచరించే అవకాశం ఉందని కాబట్టి భక్తులు విలువైన వస్తువులు ధరించ వద్దని, అక్కడ సీసీ కెమెరాల నిఘా ఉంటుందని,ఎవరైనా తప్పిపోయిన దర్గాలో మైకు అనౌస్మెంట్ చేసి తెలియ పరుచుకోవాలని, ఉరుసు మహోత్సవంలో అక్రమ మద్యం ఇతర రాష్ట్రాల మందు, అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా డిఎస్పీ ఆదేశాల మేరకు ఇద్దరు సిఐలు, 9 మంది ఎస్ఐలు,110 మంది పోలీస్ బందోబస్తుతో ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.