PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతులు పంట నమోదు- ఈ కేవైసీ తప్పనిసరి

1 min read

– మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : రైతు తాము పండించే పంటకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలలో నమోదు చేయించుకోవాలని అదేవిధంగా ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించాలని మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి అన్నారు, శనివారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పంట నమోదు అలాగే ఈ కేవైసీ చేసుకొనుటకు ఈనెల ఫిబ్రవరి 28 వ తేదీ ఆఖరి తేదీగా నిర్ణయించబడిందని తెలిపారు, ఇప్పటివరకు 3, వేల 4 వందల 36 ఎకరాలలో వివిధ పంటల కు సంబం ధించి 19, వందల 59 మంది రైతులకు పంట నమోదు చేయటం జరిగిందని తెలియజేశారు,19 వందల 59 మంది రైతులకు గాను మండలంలో 166 మంది రైతులు ఇంకా ఈ కే వై సి నమోదు చేసుకోలేదని ఆమె తెలిపారు ,పంట నమోదు, చేసుకోని రైతులకు అదేవిధంగా ఈ కేవైసీ చేసుకోని రైతులకు సున్నా వడ్డీ, పంట నష్టపరిహారం, ధాన్యం కొనుగోలు పొందుటకు తప్పనిసరిగా చేసుకోవలయునని ఆమె తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author